బెల్లం కొబ్బరి అన్నం

Flavored Rice | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం
  • 1 cup నీళ్లు
  • 1 cup పాలు /కొబ్బరి పాలు
  • 3 tbsp నెయ్యి
  • 15 జీడిపప్పు
  • 15 కిస్మిస్
  • 4 యాలకలు
  • 1 cup బెల్లం
  • 3 tbsp నీళ్లు
  • 1 cup పచ్చి కొబ్బరి తురుము

విధానం

  1. బియ్యం లో నీళ్లు పాలు పోసి కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చి స్టీమ్ పోనివ్వాలి.
  2. నెయ్యి కరిగించి జీడిపప్పు కిస్మిస్ ఎర్రగా వేపి తీసుకోవాలి.
  3. అదే నెయ్యిలో బెల్లం నీళ్లు పోసి బెల్లం కాస్త చిక్కబడనివ్వాలి.
  4. చిక్కబడుతున్న బెల్లంలో కొబ్బరి యాలకలు వేసి మరింత దగ్గర పడనివ్వాలి.
  5. పచ్చికొబ్బరి వేసి 4-5 నిమిషాలు ఉడికించాక అన్నం వేసి బాగా పట్టించి జీడిపప్పు కిస్మిస్ వేసి 8 నిమిషాలు మూత పెట్టి ఉడికించి దింపేసుకోవాలి.