స్వీట్ కార్న్ గట్టి పకోడీ | సాయంత్రాలు టీ తో కరకరలాడే సరైన జోడీ ఈ స్వీట్ కార్న్ గట్టి పకోడీ

Snacks | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup స్వీట్ కార్న్
  • 1/2 cup పలుకులుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్
  • 3 cups ఉల్లిపాయ చీలికలు
  • 3/4 cup శెనగపిండి
  • 1/4 cup బియ్యం పిండి
  • ఉప్పు
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp కారం
  • 1 tsp జీలకర్ర
  • 1/4 tsp వాము
  • 1/4 tsp పసుపు
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 2 tsp పచ్చిమిర్చి తరుగు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1/2 tsp చాట్ మసాలా /నిమ్మరసం

విధానం

  1. నీళ్ళని మరిగించి అందులో స్వీట్ కార్న్ వేసి ఒక పొంగురాగానే దింపి వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి
  2. గిన్నెలో ఉల్లిపాయ చీలికలు, పూర్తిగా చల్లారిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి గట్టిగా పిండుతూ కలుపుకుంటే నీరు వదులుతుంది.
  3. బాగా వత్తుకున్నాక మిగిలిన పదార్ధాలన్నీ వేసి గట్టిగా పిండుతూ కలుపుకోండి.
  4. కలుపుకున్న పిండిని పకోడీల మాదిరి వెల్ల మధ్యన నలుపుతూ వేసుకోవచ్చు, లేదా పునుకుల మాదిరీ వేసుకోవచ్చు.
  5. పకోడీ వేసేప్పుడు మరిగే నూనె పూర్తిగా తగ్గించి, వేశాక మీడియం – హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోండి.