చక్కెర పొంగలి

Sweets | vegetarian

  • Prep Time 3 Mins
  • Cook Time 30 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 3/4 cup బియ్యం
  • 1/4 cup పెసరపప్పు
  • 2 cup నీళ్ళు
  • 1/2 cup బెల్లం
  • 3/4 cup పంచదార
  • 1/4 cup బెల్లం కరిగించడానికి నీళ్ళు
  • 1 tsp యాలకలపొడి
  • 15 జీడిపప్పు
  • 10 ఎండు ద్రాక్ష
  • 3 tbsp ఎండుకొబ్బరి ముక్కలు
  • పచ్చ కర్పూరం – చిటికెడు
  • 6 tbsp నెయ్యి

విధానం

  1. పెసరపప్పుని సన్నని సెగ మీద కలుపుతూ సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
  2. వేపుకున్న పప్పు బియ్యం కలిపి కడిగి నీళ్ళు పోసి 3 కూతలు హై ఫ్లేమ్ మీద రానివ్వాలి.
  3. బెల్లం, పంచదారలో కాసిని నీళ్ళు పోసి బెల్లం కరిగి ఒక పొంగు రాగానే దింపుకోవాలి.
  4. ఉడికిన పెసరపప్పు అన్నంలో పాకాన్ని వడకట్టి పోసి సన్నని సెగమీద కలుపుతూ పాకం ముదురు రంగు వచ్చేదాకా ఉడికించాలి.
  5. పాకం చిక్కబడి రంగు మారుతుండగా మరో పాన్లో 3 tbsp నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు, కిస్మిస్స్, ఎండుకొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా వేపి పాకం లో ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  6. పాకం సన్నని సెగ మీద ఉడికి ఉడికి అన్నానికి పట్టి చిక్కబడుతుంది అప్పుడు మళ్ళీ 2 tbsp నెయ్యి వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి ఆకారున మరో 2 tbsp నెయ్యి యాలకల పొడి పచ్చకర్పూరం వేసి కలుపుకుని దింపేసుకోవాలి. పాకం అన్నంలో పోసాక కనీసం 20 నిమిషాల పైనే సమయం పడుతుంది పూర్తవడానికి.
  7. ఈ చక్కెర పొంగలి బయట మూడు రోజులు పాడవకుండా ఉంటుంది.