తమిళనాడు చిలకడదుంపల పులుసు

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 40 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms చిలకడదుంప ముక్కలు
  • పులుసులు కారం పొడి కోసం
  • 1/2 tsp ఆవాలు
  • 1/4 tsp మెంతులు
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp మిరియాలు
  • 1/4 cup కొబ్బరి
  • పులుసు కోసం
  • 6 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 4 ఎండుమిర్చి
  • 25 సాంబార్ ఉల్లిపాయలు
  • 2 కరివేపాకు - రెబ్బలు
  • 10 -12 వెల్లులి పాయలు
  • ఉప్పు
  • 1 cup టమాటో ముక్కలు
  • 3/4 tsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 100 -125 ml చింతపండు పులుసు (50gm చింతపండు నుండి తీసినది)
  • 1/2 liter నీళ్లు

విధానం

  1. పులుసులు కారం పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఆవాలు చిట్లి మెంతులు ఎర్రబడేదాకా వేపి మెత్తని పొడి చేసుకోండి.
  2. నూనె వేడి చేసి ఆవాలు వేసి చితాలనివ్వాలి ఆ తరువాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లులి కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద.
  3. వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు ఉప్పు వేసి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి.
  4. తరువాత కారం, ధనియాల పొడి వేసి వేపి చింతపండు పులుసు పొడి ఒక పొంగు రానివ్వాలి.
  5. పొంగుతున్న పులుసులో చిలకడదుంపల ముక్కలు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 30 నిమిషాలు వదిలేయాలి. ఇంకా కాస్త బెల్లం గడ్డ కూడా వేసుకోండి (ఇది పులుసు తియ్యగా ఇష్టపడే వారికి).
  6. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి. ఈ పులుసు వేడి అన్నం నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.