తమిళనాడు స్పెషల్ మిలగు వడ రెసిపీ | ఆంజనేయ వడ

Prasadam | vegetarian

  • Prep Time 10 Mins

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup మినపప్పు
  • 2 tsp మిరియాలు
  • ¼ tsp ఇంగువ
  • 1 tbsp జీలకర్ర
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 3 tbsp నూనె
  • నూనె (వేపుకోడానికి)

విధానం

  1. మినపప్పులో నీరు పోసి కేవలం ఇరవై నిమిషాలు మాత్రం నానబెట్టుకున్న నీటిని పూర్తిగా వడకట్టుకోవాలి.
  2. నీరు పూర్తిగా వడకట్టుకున్న పప్పులో మిరియాలు ఇంగువ జీలకర్ర ఉప్పు వేసి అస్సలు నీరు వేయకుండా బరకగా పలుకు పలుకుగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బుకున్న పిండిలో నూనె వేసి బాగా కలుపుకోవాలి.
  4. పిండి ముద్దని తడి వస్త్రం మీద లేదా నూనె రాసిన ప్లాస్టిక్ పేపర్ మీద అయినా పలుచగా వత్తుకోవాలి. వత్తుకున్న వడని గాలికి ఆరనిస్తే వాడలోని తేమ ఆరి గట్టిపడుతుంది.
  5. గాలికి ఆరిన వడని మరిగే నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా 4-5 నిమిషాలు వదిలేయండి.
  6. ఆ తరువాత నెమ్మదిగా తిరగేసి వడలని బయటకు తీసి మరో వాయి వడలని వేసుకోండి.
  7. సగం వేపుకున్న వడలని మళ్ళీ నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాకా వేపి తీసుకోండి.
  8. ఈ వడలు 15 -20 రోజులు నిల్వ ఉంటాయి.