కావాల్సిన పదార్ధాలు
-
పులుసు పేస్ట్ కోసం
-
2 - 2.5
tsp మిరియాలు
-
5
ఎండు మిర్చి
-
2
tsp ధనియాలు
-
1/4
tsp మెంతులు
-
1
tsp బియ్యం
-
1
tsp పెసరపప్పు/సెనగపప్పు
-
1
tsp జీలకర్ర
-
1/4
cup పచ్చికొబ్బరి
-
1
రెబ్బ కరివేపాకు
-
పులుసు కోసం
-
4
tbsp నూనె
-
1
tsp ఆవాలు
-
1
రెబ్బ కరివేపాకు
-
125
gm సాంబార్ ఉల్లిపాయలు
-
ఇంగువ - కొద్దిగా
-
7 - 8
వెల్లులి
-
ఉప్పు
-
1/4
tsp పసుపు
-
2
టమాటో ముక్కలు
-
300
ml చింతపండు పులుసు
(50 gm చింతపండు నుండి తీసినది)
-
400
ml నీళ్లు
విధానం
-
పులుసు కారం కోసం ఉన్న పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
-
మాంచి సువాసన వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి, కరివేపాకు వేసి వేపి మిక్సీ జార్లో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనె వేడి ఆవాలు చిట్లనిచ్చి అందులో కరివేపాకు ఇంగువ వేసి వేపుకోవాలి.
-
ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాకా మగ్గనివ్వాలి.
-
మగ్గిన టొమాటోలో చింతపండు పులుసు పోసి రెండు పొంగులు రానివ్వాలి.
-
పొంగుతున్న పులుసులో మిరియాల కారం పేస్ట్ నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద 15-20 నిమిషాలు మరగనివ్వాలి.
-
పులుసులు ఎంత మరిగితే అంత రుచి. పులుసు చిక్కబడి మాంచి సువాసన రావాలి అప్పుడు దింపేసుకోండి.