కోయంబత్తూర్ స్పెషల్ వంకాయ కొత్తిమీర కారం

Veg Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms లేత తెల్ల వంకాయ
  • సోంపు
  • 50 ml నీళ్లు
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • నానబెట్టిన పచ్చిశెనగపప్పు - చిన్న గుప్పెడు
  • 10 వెల్లులి
  • కొత్తిమీర పేస్ట్ కోసం
  • 250 gms కొత్తిమీర
  • 1/2 cup పచ్చి కొబ్బరి
  • 7-10 పచ్చిమిర్చి
  • 1.5 inch అల్లం
  • ఉప్పు
  • 1/2 cup చల్లని నీళ్లు

విధానం

  1. కొత్తిమీర పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిట్లనివ్వాలి, తరువాత వెల్లులి వేసి రంగు మారే దాకా ఎర్రగా వేపుకోవాలి.
  3. వేగిన వెల్లిలిలో పచ్చిశెనగపప్పు వేసి ఒక నిమిస్ధం వేపుకోండి, తరువాత వంకాయ ముక్కలు వేసి నూనెలో కలిపి మూత ఆపెట్టి 80% మగ్గబెట్టుకోండి. వంకాయ సగం పైన మగ్గిన తరువాత నీళ్లు చిలకరించుకుని మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతుంది.
  4. 80% మగ్గిన వంకాయలో కొత్తిమీర పేస్ట్ వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి వంకాయ మెత్తబడేదాకా ఉడికించి దింపేసుకోండి.
  5. ఈ కూర కాస్త ముద్దగానే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.