బ్రెడ్ ఉప్మా

Breakfast Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 7 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 6 Slices బ్రౌన్ బ్రెడ్
  • 2 tbsp నెయ్యి
  • 2 tsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 10 జీడిపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 tsp నిమ్మరసం
  • 1/2 tsp కారం
  • ఉప్పు – కొద్దిగా
  • 1/2 tsp సాంబార్ పొడి
  • 1/4 tsp మిరియాల పొడి
  • 1 టొమాటో (ముక్కలు)
  • 1 ఉల్లిపాయ (ముక్కలు)
  • 1/4 cup కాప్సికం (ముక్కలు)
  • 1 tsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 1 tsp అల్లం తరుగు
  • 1/3 cup నీళ్ళు

విధానం

  1. పెనం మీద ½ చెంచా నెయ్యి పూసి బ్రెడ్ని సన్నని సెగ మీద రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి
  2. కాల్చుకున్న బ్రెడ్ని ముక్కలుగా చేసుకోండి
  3. నూనె మిగిలిన వేడి చేసి ఆవాలు జీడిపప్పు వేసి జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాక వేపుకోవాలి
  4. తరువాత జీలకర్ర కరివేపాకు వేసి వేపి ఉల్లిపాయ తరుగు వేసి ఒక నిమిషం వేపుకోండి చాలు
  5. వేగిన ఉల్లిలో టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి అల్లం తరుగు, కాప్సికం తరుగు, ఉప్పు కారం సాంబార్ పొడి వేసి కలిపి టొమాటో మెత్తబడేదాకా మూతపెట్టి మగ్గించుకోవాలి
  6. టొమాటో పైన తోలు సులభంగా వచ్చేస్తున్నప్పుడు ¼ కప్పు నీళ్ళు పోసి హై-ఫ్లేమ్ మీద మరిగించాలి.
  7. తరువాత టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
  8. ఆఖరున పైన 3 tbsp నీళ్ళు చిలకరించి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికిస్తే బ్రెడ్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మెత్తబడుతుంది.
  9. 5 నిమిషాల తరువాత మిరియాల పొడి చల్లి కలిపి వేడి వేడిగా సర్వ చేసుకోండి.