సగ్గుబియ్యం చివడా | తిన్నకొద్దీ తినాలనిపించే సగ్గుబియ్యం మిక్చర్

Snacks | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 300 gm నైలాన్ సగ్గుబియ్యం
  • 1/2 cup ఎండుకొబ్బరి చీలికలు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/4 cup జీడిపప్పు
  • 1/4 cup ఎండు ద్రాక్ష
  • 1/2 cup వేరుశెనగపప్పు
  • 1 tsp ఉప్పు
  • 1.5 tbsp పంచదార
  • 3 చీలికలు పచ్చిమిర్చి
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. వేడెక్కిన నూనెలో సగ్గుబియ్యం పిడికెడు వేసి బాగా పొంగి చిట్లేదాకా వేపుకుని తీసుకోండి. ఇలాగే మిగిలిన సగ్గుబియ్యం అంతా వేపుకోండి.
  2. అదే నూనెలో పల్లీలు, జీడిపప్పు, ఎండు ద్రాక్షా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి వేసి ఎర్రగా వేపి వేపుకున్న సగ్గుబియ్యంలో వేసుకోండి. సగ్గుబియ్యాన్ని పూర్తిగా చల్లరనివ్వండి.
  3. ఉప్పు, పంచదార వేసి కలిపి వేపుకున్న సగ్గుబియ్యంలో చల్లి కలుపుకోవాలి.
  4. ఇవి గాలి చోరాణి డబ్బాలో ఉంచితే కనీసం 3 రోజులు తాజాగా ఉంటాయ్. పచ్చిమిర్చికి బదులు కారం వేసుకుంటే చాలా ఇంకా ఎక్కువ రోజులు నిలవుంటాయ్.