ఉల్లి బోండా | టీ షాప్ స్టైల్ ఉల్లి బోండా | ఆనియన్ బోండా

Street Food | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • ½ kg ఉల్లిపాయ చీలికలు
  • 2 tbsp పచ్చిమిర్చి ముక్కలు
  • ½ tsp జీలకర్ర
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 1. 1/2 tsp కారం
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 2 tbsp కరివేపాకు తరుగు
  • ¼ cup కొత్తిమీర తరుగు
  • ¼ cup పుదీనా తరుగు
  • 3 tbsp బియ్యం పిండి
  • 2 tbsp మైదా పిండి
  • ¾ cup సెనగపిండి
  • నూనె - బొండాలు వేపుకోడానికి

విధానం

  1. కాస్త మందంగా చీరుకున్న ఉల్లిపాయల్లో పిండ్లు తప్ప మిగిలిన పదార్ధలన్నీ వేసి గట్టిగా పిండుకోండి.
  2. పిండుకున్న ఉల్లిలో మైదా బియ్యం పిండి సెనగపిండి వేసి తడిపొడిగా కలుపుకోండి.
  3. చేతులు తడి చేసుకుని చిన్న ఉండలుగా మరిగే వేడి నూనెలో బొండాలు వేసి మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు వేగనివ్వండి.
  4. 3 నిమిషాలు వేగిన తరువాత బోండాలని నెమ్మదిగా తిరగేస్తూ బొండాల చుట్టూ బుడగలు తగ్గేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి.
  5. బొండాలు వేడి మీద కాస్త మెత్తగా అనిపిస్తాయి కాబట్టి 5 నిమిషాలు జల్లెడలో వేసి వదిలేస్తే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఉల్లి బోండా తయారైపోతుంది.