అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనెవేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
రెండు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లులి ముద్ద వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
వేగిన అల్లం వెల్లులి ముద్దలో చికెన్ ముక్కలు వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి.
రెండు నిమిషాల తరువాత ఉప్పు కారం ధనియాల పొడి, జీలకర్ర పొడి,పసుపు గరం మసాలా వేసి బాగా పట్టించాలి చికెన్కి.
మసాలాలు చికెన్కి బాగా పట్టి, చికెన్లోని నీరు ఆవిరి అయ్యాక 2 tbsp నీళ్ళు పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు వేపుకోవాలి.
4-5 నిమిషాలకి మసాలాలు వేగి అడుగుపడుతుంది అప్పుడు మసాలాలని గీరి బాగా కలిపి మూత పెట్టి వేపుకోవాలి. ఇలాగే ప్రతీ 5 నిమిషాలకి ఒక సారి కలుపుతూ 15 నిమిషాలు వేపుకుని చింతపండు పులుసు పోసి మరో 10 నిమిషాలు వేపుకోవాలి.
10 నిమిషాల తరువాత మిరియాల పొడి కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.