మిక్సీ లో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
¾ నీళ్ళని మరిగించండి.
బియ్యం పిండి లో కొబ్బరి తురుము, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్దా వేసి బాగా కలుపుకోవాలి.
వేడి నీళ్ళు కొద్దికొద్దిగా చేర్చుకుంటూ ముందు చెంచా తో కలుపుకుని ఆ తరువాత చేత్తో గట్టిగా పూరి పిండిలా పిండిని కలుపుకోవాలి.
పోలిథిన్ షీట్ మీద 2-3 బొట్లు నూనె వేసి నూనెతో తడి చేసుకున్న చేత్తో పిండి ముద్దని చెక్కల మాదిరి వత్తుకోవాలి, ఇది కావాలంటే నూనె రాసిన పాలిథిన్ షీట్ పెట్టి పూరి ప్రెస్ లో కూడా వత్తుకోవచ్చు.
వత్తుకున్న వీటిని వేడి వేడి నూనె లో వేసి ఎర్రగా వేపుకుని తీసి పక్కనుంచుకోండి.