చికెన్కి ఉప్పు అల్లం వెల్లులి ముద్దతో బాగా మర్ధనా చేసి పక్కనుంచుకోండి
పాన్లో మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద వేపి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి
అల్లం వెల్లులి ముద్ద కలుపుకున్న చికెన్లో మసాలా పేస్ట్ ఇంకా కూర కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి రుద్దుతూ పట్టించి ఫ్రిజ్లో 2 గంటలు ఉంచాలి
పాన్లో నూనె నెయ్యి వేసి చేసి అందులో 2 గంటలు ఫ్రిజ్లో ఉంచిన చికెన్ వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి
ప్రతీ 5 నిమిషాలకి ఒక సారి చికెన్ని కలుపుకోవాలి లేదంటే అడుగుపడుతుంది. 25 నిమిషాలకి చికెన్ ఉడికి నూనె పైకి తేలుతుంది అప్పుడు క్రీమ్ వేసి కలిపి దింపేసుకోవాలి.