ఆంధ్రా వెడ్డింగ్స్ స్టైల్ దొండకాయ 65

Wedding Style recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 30 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kg లేత దొండకాయలు (4 సగాలుగా చీరుకున్నవి)
  • నూనె - వేపుకోడానికి
  • 1/2 cup సెనగపిండి
  • 2 tbsp బియ్యం పిండి
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 1/4 tsp పసుపు
  • 2 inch అల్లం
  • 1 tsp జీలకర్ర
  • 7 - 8 పచ్చిమిర్చి
  • 1/4 cup వేరు సెనగ గుండ్లు
  • కరివేపాకు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 3/4 tsp కారం
  • 1/2 tsp గరం మసాలా

విధానం

  1. నాలుగు సగాలుగా చీరుకున్న దొండకాయ ముక్కల్ని నీళ్లలో వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే దాగా ఉడకనివ్వాలి.
  2. ఒక పొంగు రాగానే మగ్గిన దొండకాయ ముక్కలని తీసి జల్లెడలో వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి.
  3. దొండకాయలు చల్లారేలోగా మిక్సీలో 8-10 పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.
  4. చల్లారిన దొండకాయ ముక్కల్లో అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, సెనగపిండి, బియ్యం పిండి వేసి ముక్కలని మెదపకుండా నెమ్మదిగా పిండి పట్టించండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి (టిప్స్ చూడండి).
  5. మరిగే వేడి నూనెలో సగం దొండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు మగ్గే దాకా వేపుకోండి అంటే 8-10 నిమిషాలు. (దొండకాయలు వేగడానికి సమయం పడుతుంది).
  6. ముక్కలు మగ్గి రంగు మారుతున్నప్పుడు హై ఫ్లేమ్ మీద కారకరలాడేట్టు వేపుకోండి.
  7. అదే నూనెలో వేరుశెనగ గుండ్లు, కరివేపాకు వేసి వేపి వేపుకున్న దొండకాయ ముక్కల్లో వేసుకోండి.
  8. వేగిన ముక్కల్లో ఉప్పు కారం జీలకర్ర పొడి గరం మసాలా వేసి టాస్ చేసుకోండి.