దొండకాయ ముద్ద కూర | కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా ఉండాలనుకుంటే ఆంధ్రా స్టైల్ “దొండకాయ ముద్ద కూర” ట్రై చేయండి

Veg Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms లేత దొండకాయ ముక్కలు (పొడవుగా సన్నగా చీరినవి)
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • నీళ్ళు – ముక్కలు మునిగేదాక
  • కొబ్బరి కారం కోసం
  • 1 tsp ఆవాలు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 7 - 8 ఎండు మిర్చి
  • పచ్చి కొబ్బరి – సగం చిప్ప
  • కూర కోసం
  • 2 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1/2 cup చింతపండు పులుసు (125 ml)
  • కొద్దిగా ఉప్పు
  • బెల్లం – కొద్దిగా

విధానం

  1. సన్నగా పొడవుగా చీరుకున్న దొండకాయ ముక్కలులో ఉప్పు, పసుపు, ముక్కలు మునిగేదాక నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేమ్ మీద ఒక విసిల్ రానిచ్చి దింపేయండి
  2. కొబ్బరి కారం కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటిగా అంటే ఆవాలుతో మొదలు పెట్టి ఆఖరున కొబ్బరి వేసి ఎర్రగా వేపుకోవాలి. చల్లారాక పొడి చేసుకోవాలి
  3. నూనె వేడి చేసి ఆవాలు కరివేపాకు వేసి వేపుకోవాలి
  4. బారకగా రుబ్బుకున్న కొబ్బరి కారం వేసి ఒక నిమిషం వేపి చింతపండు పులుసు పోసి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి
  5. నూనె పైకి తేలాక ఉడికించున్న దొండకాయ ముక్కలు వడకట్టి పులుసులో వేసి నెమ్మదిగా పట్టించి మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించాలి
  6. ఆఖరున దింపే ముందు కొద్దిగా బెల్లం వేసి కలిపి దింపేసుకోవాలి.