టమాటో కరివేపాకు పచ్చడి

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms టమాటో
  • 1 cup కరివేపాకు
  • 1/4 cup కొత్తిమీర
  • 1.5 tbsp నువ్వులు
  • 1/2 cup పచ్చి కొబ్బరి తురుము
  • 6 పచ్చిమిర్చి
  • 3 tbsp నూనె
  • తాలింపు కోసం
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 1/2 tsp మినపప్పు
  • 1 tsp పచ్చిశెనగపప్పు
  • 2 ఎండుమిర్చి

విధానం

  1. 1 tbsp నూనె వేడి చేసి అందులో నువ్వులు వేసి చిట్లనివ్వాలి, తరువాత కొబ్బరి తురుము పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి.
  2. వేగిన పచ్చిమిర్చిలో కరివేపాకు వేసి ఆకులో పసరు వాసన పోయేదాకా వేపుకోవాలి.
  3. తరువాత వేపిన కరివేపాకు నువ్వులు అన్నీ మిక్సీలోకి తీసుకొని కొత్తిమీరతో సహా కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. మూకుడులో ఇంకో tbsp నూనె వేడి చేసి అందులో టమాటో ముక్కలు ఉప్పు వేసి మెత్తగా మగ్గించి గ్రైండ్ చేసుకున్న కరివేపాకులో వేసి 2-3 సార్లు పల్స్ చేసుకుని తీసుకోవాలి.
  5. తాలింపు కోసం మిగిలిన నూనె వేడి చేసి అందులో తాలింపు దినుసులు వేసి ఎర్రగా వేపి పచ్చడిలో కలిపేసుకోవాలి.