టమాటో కొత్తిమీర సూప్

Appetizers | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 18 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms టొమాటో ముక్కలు
  • 75 gms కొత్తిమీర కాడలు
  • 1/2 tsp మిరియాలు
  • 1/2 దంచిన అల్లం
  • 5 - 6 దంచిన వెల్లులి
  • 1 బిర్యానీ ఆకు
  • 1 tsp వెన్న/ నెయ్యి
  • 1 tsp నూనె
  • 3 యాలకలు
  • 3 లవంగాలు
  • 1/2 ఇంచ్ దాల్చిన చెక్క
  • ఉప్పు
  • 1/2 tsp వేపిన జీలకర్ర పొడి
  • 1/2 tsp కారం
  • 1 tbsp కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • 500 - 600 ml నీళ్ళు
  • 1 tsp గోధుమ పిండి

విధానం

  1. వెన్న నూనె వేడి చేసి అందులో అల్లం, వెల్లులి, యాలకలు, లవంగాలు బిర్యానీ ఆకు, మిరియాలు వేసి వేపుకోవాలి.
  2. వేగిన మాసాలలో గోధుమపిండి వేసి ఎర్రగా వేపి టొమాటో ముక్కలు కొత్తిమీర కాడలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి టొమాటో మెత్తబడే దాకా వేపుకోవాలి.
  3. టొమాటో మెత్తగా గుజ్జుగా అయ్యాక నీళ్ళు పోసి సన్నని సెగ మీద 400 ml అయ్యేదాక మరిగించుకోవాలి.
  4. మరిగిన షోర్బాని జల్లెడలో వేసి వడకట్టి పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి వేడివేడిగా సర్వ చేసుకోండి.