టమాటో రసం | బెస్ట్ టొమాటో రసం చారు

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 15 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 4 పండిన నాటు టొమాటోలు
  • చిన్న కట్ట కొత్తిమీర కాడలు
  • 1/2 liter నీళ్ళు
  • 1 tsp జీలకర్ర
  • 1.5 tbsp నల్ల మిరియాలు
  • 10 వెల్లులి
  • 1 కరివేపాకు
  • 2 tbsp చింతపండు (గోళీ సైజు చింతపండు నుండి తీసినది)
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1/4 tsp పసుపు
  • రాళ్ళ ఉప్పు
  • తాలింపు
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 4 ఎండుమిర్చి
  • ఇంగువ – చిటికెడు
  • 1 రెబ్బ కరివేపాకు

విధానం

  1. టొమాటో ముక్కల్లో కొత్తిమీర కాడలు వేసి గట్టిగా పిండుతూ రసాన్ని తీయండి, తరువాత మిగిలం పిప్పి తీసేసి రసం లో ½ లీటర్ నీళ్ళు పోసి ఉంచుకోండి.
  2. జీలకర్ర , మిరియాలు, వెల్లులి, కరివేపాకు వేసి కచ్చపచ్చగా దంచుకోండి.
  3. గిన్నెలో టొమాటో రసం పోసి అందులో పచ్చిమిర్చి చీలికలు వేసి మూతపెట్టి పచ్చిమిర్చి మెత్తబడే దాకా మరిగించాలి.
  4. పచ్చిమిర్చి మగ్గగానే జీలకర్ర మిరియాల ముద్దా, పసుపు, ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద. ఒక పొంగు ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేయాలి.
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు చిటచిట అన్నాక మిగిలిన పదార్ధాలన్నీ వేసి వేపి చారు లో కలిపేయండి. వేడి అన్నంతో తృప్తిగా తినండి.