పాన్ లో మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి, తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేపి ఆఖరున నువ్వులు వేసి చిటచిట అనేదాకా వేపుకోండి. తరువాత చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి.
ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి వేసి మగ్గించుకోండి, పచ్చిమిర్చి మగ్గాక అందులో టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి.
టొమాటోలు పూర్తిగా మగ్గి గుజ్జుగా అవ్వాలి, అప్పుడు నువ్వుల పొడి లో వేసుకోండి. అలాగే వెల్లూలి, సాల్ట్ వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
తాలిమ్పుకి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపి చట్నీ లో కలుపుకోండి.
ఇది చలికాలం లో అయితే ఫ్రిజ్ లో పెడితే 3 రోజులు నిలవుంటుంది.