కంది పొడి

Podi / Karam | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 20 Mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup కందిపప్పు
  • 1/2 cup సెనగపప్పు
  • 1/2 cup పెసరపప్పు
  • 1/4 cup మినపప్పు
  • 50 gm ఎండు మిరపకాయలు
  • 2 tbsp జీలకర్ర
  • 2 tbsp శొంఠి

విధానం

  1. పాన్లో ఒక్కో పప్పు వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన రంగు వచ్చే దాకా వేపి తీసి చల్లార్చుకోండి.
  2. ఎండు మిరపకాయలు కూడా కాస్త రంగు మారే దాకా వేపి తీసుకోండి.
  3. జీలకర్ర వేపి తీసుకోండి.
  4. మిక్సీలో ముందు మిరపకాయాలు జీలకర్ర గ్రైండ్ చేసి మిగిలిన పప్పులు వేసి శొంఠి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి( గ్రైండ్ ఎలా చేసుకోవాలో టిప్స్ చుడండి).
  5. ఈ పొడి గాలి పోనీ డబ్బాలో పెడితే రెండు నెలలు నిలవుంటుంది. కొబ్బరి వేస్తే తక్కువ నిలవుంటుంది.