ఉడుపి హోటల్ స్టైల్ చపాతీ కూర్మ | ఉడుపి హోటల్ కూర్మ
Restaurant Style Recipes
|
vegetarian
Prep Time5 Mins
Cook Time25 Mins
Servings6
కావాల్సిన పదార్ధాలు
మసాలా పేస్ట్ కోసం
3
tbsp నూనె
4
యాలకలు
4
లవంగాలు
1.5
inch దాల్చిన చెక్క
1
tsp మిరియాలు
1
tbsp పచ్చశెనగపప్పు
1
tbsp మినపప్పు
4
బైడగీ మిరపకాయలు
4
కారం మిరపకాయలు
1
cup పచ్చికొబ్బరి తురుము
కూర్మ కోసం
1/2
cup ఉల్లిపాయ తరుగు
1/2
cup కేరట్ ముక్కలు
1/2
cup బటానీ
1/2
cup బంగాళా దుంప ముక్కలు
1/2
liter నీళ్ళు
1/2
tsp పసుపు
3
tbsp చింతపండు పులుసు
ఉప్పు
1/2
tsp కారం
1
tsp బెల్లం
2
tbsp కొత్తిమీర తరుగు
విధానం
నూనె వేడి చేసి అందులో యాలక లవంగాలు మిరియాలతో పాటు మిగిలినవన్నీ వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి
తరువాత వేపుకున్న వాటిని మిక్సీలో వేసుకోండి అలాగే తాజా కొబ్బరి తురుము కూడా వేసి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోవాలి
పప్పులు వేపగా మిగిలిన నూనెలోనె ఉల్లిపాయ తరుగు, కేరట్ తరుగు, తాజా బటానీ, చెక్కు తీసిన దుంప ముక్కలు వేసి 3 నిమిషాలు వేపుకోవాలి
వేగిన ముక్కల్లో అర లీటర్ నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 80% ఉడికించాలి. (80% అంటే ఆలూ ని ఫోర్క్తో గుచ్చితే మెత్తగా లోపలికి దిగాలి పైకి లేపితే ఫోర్క్ పై నిలిచి ఉండాలి)
తరువాత వెన్నలా రుబ్బుకున్న మసాలా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి నూనె పైకి తేలేదాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి
నూనె పైకి తేలాక కాస్త బెల్లం గడ్డ, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి
ఈ కూర్మ చపాతీ, పూరీ, సెట్ దోశ, ఆపంలలోకి చాలా రుచిగా ఉంటుంది.