అటుకుల రవ్వ కేసరి | కేసరి చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది | ఉడిపి స్టైల్ అటుకుల రవ్వ కేసరి

Sweets | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup మందం అటుకులు
  • 1 cup పంచదార
  • 2 tbsp నెయ్యి
  • 1/2 tsp యాలకలపొడి
  • 1/4 tsp జీడిపప్పు
  • 2 tbsp ఎండు ద్రాక్ష
  • 1/4 tsp ఆరెంజ్ ఫుడ్ కలర్
  • 2 cups నీళ్ళు

విధానం

  1. అటుకులు రంగు మారకుండా కలుపుతూ కరకరలాడేట్టు వేపుకుని, మిక్సీలో రవ్వగా చేసుకోవాలి.
  2. నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  3. అదే ముకుడులో నీళ్ళు పోసి మరగనివ్వాలి, మరుగుతున్న నీళ్ళలో అటుకుల రవ్వ వేసి ఉడకనివ్వాలి.
  4. రవ్వ మెత్తగా ఉడికాక, పంచదార, రంగు, యాలకలపొడి వేసి బాగా కలిపి దగ్గర పడనిచ్చి వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్స్ వేసి కలిపి దింపేసుకోండి. నచ్చితే ఆఖరున పచ్చకర్పూరం వేసుకుని దింపేసుకోండి.