వెనీలా ఐస్క్రీమ్ బర్ఫీ

Sweets | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Resting Time 360 Mins
  • Servings 22

కావాల్సిన పదార్ధాలు

  • 200 gm తీపి పాల పిండి
  • 200 gm పెరిన నెయ్యి
  • 250 gm పంచదార
  • 150 ml నీళ్ళు
  • 1 tbsp వెనీలా షుగర్
  • 2 tbsps పిస్తా పలుకులు

విధానం

  1. ముందుగా ట్రేలో 8*6 అంగుళాల ట్రేలో బటర్ పేపర్ వేసి పిస్తా పలుకులు చల్లి పక్కనుంచుకోండి.
  2. పాల పిండిలో నెయ్యి వేసి బాగా కలిపి ముద్దగా చేసి పక్కనుంచుకోండి.
  3. పంచదారలో నీళ్ళు పోసి ఒక తీగ పాకం వచ్చేదాక మరించాలి.
  4. తీగపాకం రాగానే స్టవ్ ఆపేసి, కలిపి ఉంచుకున్న పాలపిండి ముద్ద వేసి పాకంలో కరిగిపోయేదాక కలపాలి.
  5. చిన్న ఉండ తీసి వేళ్ళ మధ్య నలిపితే బర్ఫీ ఎంత చిక్కబడింది తెలుస్తుంది. తరువాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి వెనీలా షుగర్ వేసి సన్నని సెగ మీద మూకుడు అంతా తిప్పుకుంటూ ఉడికించాలి.
  6. 4 నిమిషాల తరువాత బర్ఫీ చిన్న ముద్ద వేళ్ళ మధ్యపెట్టి నలిపితే ఉండకట్టాలి, ఉండ కడితే స్టవ్ ఆపేసి దింపి బర్ఫీని ముకుడులో మరో 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి.
  7. 3 నిమిషాల తరువాత బర్ఫీని పిస్తా పలుకులు చల్లుకున్న ట్రేలో పోసి స్పాటులాతో చదును చేసి ఆరు గంటలు లేదా రాత్రంతా చల్లారనివ్వాలి.
  8. 6 గంటల తరువాత చల్లారిన బర్ఫీని బోరలిస్తే సులభంగా వచ్చేస్తుంది. అప్పుడు సన్నగా పొడవుగా ముక్కలుగా కోసుకోండి. ఇవి ఫ్రిజ్లో అయితే నెలరోజులు నిలవ ఉంటాయ్.