3/4
cup చింతపండు పులుసు (( 35 గ్రాముల నుండి తీసినది))
1/2
Litre నీరు
కొత్తిమీర తరుగు - చిన్న కట్ట
1
tbsp నెయ్యి
విధానం
నూనె వేడి చేసి నీటిని పిండిన మునక్కాయ ముక్కలు, గాట్లు పెట్టుకున్న వంకాయలు కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 8-10 నిమిషాలు మగ్గించుకోండి.
మగ్గిన వంకాయలని, మునక్కాయలని తీసి పక్కనుంచుకొండి.
మిగిలిన నూనెలో, ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేపుకోండి. తరువాత పచ్చికొబ్బరి, పుట్నాల పప్పు వేసి వేపుకోండి.
కొబ్బరి వేగిన తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తబడనిచ్చి తీసి మిక్సీ జార్లో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
రెండు tbsp నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు వేసి వేపుకోండి. తరువాత ఇంగువ, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ముక్కలు వేసి వేపుకోండి.
వేగిన తాలింపులో, ఉల్లిపాయ తరుగు, రెండు చీరిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి, ఉల్లిపాయ మెత్తబడేదాకా మూతపెట్టి మగ్గించుకోండి.
ఉల్లిపాయ రంగు మారిన తరువాత, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి. ఆ ఆతరువాత కారం పసుపు కొద్దిగా నీరు వేసి వేపుకోండి.
కారాలు వేగిన తరువాత, గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా నీరు వేసి కలుపుకోండి. ఆ తరువాత వేపుకున్న వంకాయ మునక్కాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 17-20 నిమిషాలు ఉడికించుకోవాలి.
వంకాయ మెత్తబడిన తరువాత చింతపండు పులుసు, బెల్లం కొత్తిమీర వేసి కలిపి 2-3 పొంగులు రానివ్వాలి.
ఆఖరుగా నెయ్యి, ఇంకొంచెం కొత్తిమీర వేసి కలిపి దింపేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి.