బెస్ట్ దాల్ ఖమన్

Breakfast Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 90 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • ఖమన్ కోసం
  • 1.5 cups పచ్చి శెనగపప్పు (4 గంటలు నానబెట్టినది)
  • 2 tbsp బియ్యం (4 గంటలు నానబెట్టినది)
  • 2 tbsp మినపప్పు (4 గంటలు నానబెట్టినది)
  • 1/2 cup పెరుగు
  • నీళ్ళు – రుబ్బుకోడానికి
  • ఉప్పు – తగినంత
  • 2 tbsp నూనె
  • 1 tbsp ఈనొ
  • 1/4 tsp వంట సోడా
  • 1/2 tsp పసుపు
  • 3 tbsp నూనె (పులిసిన పిండిలో కలుపుకోడానికి)
  • 3 - 4 నీళ్ళు (పిండి పలుచన చేసుకోడానికి)
  • కొత్తిమీర – కట్ట సన్నని తరుగు
  • 3 tbsp పచ్చి కొబ్బరి తురుము
  • 1 అల్లం పచ్చిమిర్చి పేస్ట్
  • 5 మీడియం కారం పచ్చిమిర్చి
  • 3 మీడియం కారం పచ్చిమిర్చి
  • 1 ఇంచ్ అల్లం
  • 1/8 tsp నిమ్మ ఉప్పు
  • 1 tbsp నిమ్మరసం
  • 10 - 12 వెల్లులి
  • తాలింపు కోసం
  • 2 tbsp నూనె
  • 1.5 tsp ఆవాలు
  • 5 పచ్చిమిర్చి
  • ఉప్పు కొద్దిగా
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 3 కరివేపాకు రెబ్బలు
  • 1/2 cup నీళ్ళు
  • 1.5 tbsp పంచదార

విధానం

  1. 4 గంటలు నానిన శెనగపప్పు, బియ్యం మినపపప్పుని మిక్సీలో వేసి పెరుగుతో సన్నని రవ్వలా రుబ్బుకోవాలి
  2. రుబ్బుకున్న పిండిలో ఉప్పు నూనె వేసి 2-3 నిమిషాలు బాగా బీట్ చేసుకుని మూత పెట్టి 5 గంటలు వదిలేయాలి
  3. మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి బరకగా రుబ్బుకోండి
  4. కేక్ మౌల్డ్ని నూనెతో గ్రీస్ చేసి పక్కనుంచుకోండి
  5. ఐదు గంటల తరువాత పిండిలో పసుపు నూనె అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు బీట్ చేసుకోవాలి
  6. తరువాత వంట సోడా, ఈనో వేసి ఈనో పైన నిమ్మరసం పిండి ఒకే వైపు బాగా కలుపుకుంటే పిండి పొంగుతుంది
  7. పొంగిన పిండిని మౌల్డ్లో పోసి కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఖమన్ మౌల్డ్ పెట్టి మూత పెట్టి ఆవిరి మీద 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకోవాలి ( ఇడ్లీల మాదిరి)
  8. 8 నిమిషాల తరువాత టూత్పిక్ గుచ్చి క్లీన్గా వస్తే క్లాత్ కప్పి పూర్తిగా చల్లరనివ్వాలి
  9. చల్లారిన ఖమన్ని ముక్కలుగా కోసుకోవాలి
  10. తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు చిటచిటలాడించాక పచ్చిమిర్చి ముక్కలు ఇంగువ ఉప్పు కరివేపాకు వేసి వేపి నీళ్ళు పంచదార వేసి హై-ఫ్లేమ్ మీద ఒక పొంగు రానిచ్చి దింపేసుకోండి
  11. తాలింపు నీళ్ళుతో ఖమన్ ముక్కలని తడుపుకోండి. పైన సన్నని కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము చల్లి పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి.