కావాల్సిన పదార్ధాలు
-
1/2
cup కాప్సికం తరుగు
-
1/4
cup ఫ్రోజెన్ బాటనీ
-
1/2
cup కేరట్ తరుగు
-
1/2
cup ఫ్రెంచ్ బీన్స్ తరుగు
-
1/2
cup ఉల్లిపాయ సన్నని తరుగు
-
3
టమాటో పేస్టు
-
2
పచ్చిమిర్చి తరుగు
-
2
tbsps కొత్తిమీర
-
2
tsps కారం
-
1
tsp ధనియాల పొడి
-
1
tsp వేయించిన జీలకర్ర పొడి
-
1
tsp గరం మసాలా
-
1/2
tsp కాశ్మీరీ కారం
-
ఉప్పు
-
1
tsp జీలకర్ర
-
1
tbsp అల్లం వెల్లులి పేస్టు
-
2
tsps వెల్లులి తరుగు
-
2
tsps జీడిపప్పు పేస్టు
-
1
tsp కసూరి మేథి
-
1
tsp ఫ్రెష్ క్రీం
-
2
tbsps నూనె
-
1
tbsp బటర్
-
2
tsps నెయ్యి
-
250
ml నీళ్ళు
విధానం
-
నూనె, బటర్ వేడి చేసి అందులో జీలకర్ర, వెల్లులి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించుకోండి.
-
ఇప్పుడు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోండి.
-
తరువాత ఉప్పు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కష్మీరి కారం వేసి బాగా వేయించి, కాప్సికం ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
-
టమాటో పేస్టు వేసి టొమాటోలు పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేసుకోండి.
-
ఆ తరువాత కేరట్ తరుగు, ఫ్రెంచ్ బీన్స్ సన్నని తరుగు వేసి ముక్కలు మగ్గే దాకా ఫ్రై చేసుకోండి.
-
ఇప్పుడు ఫ్రోజెన్ బాటనీ వేసి మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకుని నీళ్ళు పోసి, జీడిపప్పు పేస్టు వేసి బాగా కలుపుకుని కూరని మీడియం మంట మీద దగ్గర పడనివ్వండి.
-
దింపే ముందు కొత్తిమీర తరుగు, ఫ్రెష్ క్రీం, నెయ్యి కసూరి మేథీ వేసి బాగా కలిపి మరో 3 నిమిషాలు కుక్ చేసుకోండి.