టబ్స్ప్ నెయ్యి కరిగించి అందులో సేమియా వేసి కాస్త తెల్లగా అయ్యేదాకా లో-ఫ్లేమ్ మీద వేపుకోవాలి. సేమియా తెల్లబడ్డాక రవ్వ వేసి సేమియా విరగకుండా సేమియా లేత బంగారు రంగు వచ్చేదాకా వేపి దింపి పూర్తిగా చల్లార్చుకోవాలి.
నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేపుకోవాలి, జీడీపప్పు రంగు మారుతుండగా ఆవాలు మినపప్పు సెనగపప్పు వేసి తాలింపు మాంచి రంగులోకి వేపుకోవాలి.
తరువాత జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి తాలింపు వేపుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడనివ్వాలి.
మెత్తబడిన ఉల్లిపాయ ముక్కల్లో అల్లం తరుగు, కేరట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి 3-4 నిమిషాలు వేపుకోవాలి.
వేగిన కేరట్ ముక్కల్లో నీళ్లు పోసి హై - ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మరుగుతున్న ఎసరులో వేపిన సేమియా వేసి నెమ్మదిగా కలిపి మూతపెట్టి 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
8 నిమిషాల తరువాత మూత తీసి నెమ్మదిగా కలిపి ఆఖరుగా కొత్తిమీర, పుదీనా మటన్ మసాలా నెయ్యి వేసి కలిపి మరో 3 నిమిషాలు ఉడికించి దింపి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేస్తే పర్ఫెక్టుగా సెట్ అవుతుంది.