Close Window
Print
Recipe Picture
పెళ్ళిళ్ళ స్పెషల్ ఇన్స్టంట్ మామిడికాయ ముక్కల పచ్చడి
Pickles & Chutneys | vegetarian
Prep Time
5 Mins
Cook Time
5 Mins
Total Time
10 Mins
Servings
12
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
300 gms
లేత మామిడి కాయ ముక్కలు
2 tbsps
అల్లం ముక్కలు
1/2 tsp
మెంతులు
1/2 tbsp
రాళ్ళ ఉప్పు
75 ml
నూనె
1/4 tsp
ఇంగువ
1 tsp
ఆవాలు
2.5 tbsps
ఉప్పు
3.5 tbsps
కారం
1 tbsp
నిమ్మరసం
విధానం
Hide Pictures
మామిడి ముక్కల్లో అల్లం ముక్కలు ఉప్పు వేసి తడి లేని గరిటతో కలిపి 30 నిమిషాలు ఊరనివ్వాలి.
మెంతులు వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేపి అందులో ½ tsp రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. (ఇంత కొంచెం మిక్సీలో నలగదు అందుకే దంచాను).
నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటచిటలాడించి స్టవ్ ఆపేసి నూనె గోరు వెచ్చగా అయ్యేదాక చల్లరనివ్వాలి.
అందులో ఇంగువ బాగా కలుపుకోండి, ఆ తరువాత ఊరబెట్టిన మామిడి ముక్కలు, కారం ఉప్పు, నిమ్మరసం, మెంతి పిండి వేసి బాగా కలుపుకోండి.
కలిపిన ఈ పచ్చడిని 2 గంటలైనా ఊరబెట్టాలి. ఇంకా 3 -4 రోజులు నిలవ ఉంటుంది.