వెడ్డింగ్ స్టైల్ కొబ్బరన్నం

Wedding Style recipes | vegetarian

  • Prep Time 20 Mins
  • Cook Time 10 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup Rice
  • 3 tbsp Coconut Oil
  • 15 - 20
  • 1 tsp Mustard Seeds
  • 1 tbsp Bengal Gram
  • 1 tbsp Black Gram
  • 3 Dry Chillies
  • 1 tsp Cumin
  • 2 Pinches Asafoetida
  • 15 Raisins
  • Salt – To Taste
  • 1 cup Fresh Coconut (Grated)
  • 2 Green Chilli (Slit lengthwise)
  • 1 inch Ginger (finely chopped)
  • Coriander Leaves (Kothmir) – A little
  • 1 Onion (Finely chopped)

విధానం

  1. కప్పు బియ్యాన్ని ఉప్పేసి ఒకటికి రెండు నీళ్లు పోసి పొడి పొడిగా వండుకుని పక్కనుంచుకొండి
  2. కొబ్బరి నూనె వేడి చేసి బాగా పొగలు రానివ్వాలి. పొగలొస్తున్నా నూనెలో ఆవాలు, సెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి
  3. పప్పులు వేగుతున్నప్పుడే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కిస్మిస్ పొంగనివ్వాలి
  4. వేగుతున్న తాలింపులో ఎండు మిర్చి ఇంగువ జీలకర్ర కరివేపాకు వేసి వేపుకొండి.
  5. వేగిన తాలింపులో ఉల్లిపాయ సన్నని తరుగు రుచికి సరిపడా పచ్చిమరీచి చీలికలు ఉప్పు వేసి ఉల్లిపాయని ఎర్రగా వేపుకోవాలి
  6. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తరువాత పచ్చికొబ్బరి తురుము వేసి కచ్చితంగా బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. కొబ్బరి రంగు మారగానే పొడి పొడిగా వండుకున్న అన్నం వేసి హై ఫ్లేమ్ మీద మెతుకు వేడెక్కేదాకా టాస్ చేయండి.
  7. దింపే ముందు కొత్తిమీర తరుగు, అల్లం తరుగు వేసి కలిపి దింపేసుకోండి.