ప్యూర్ వెజ్ కీమా బాల్స్ మాసాలా | సొయా కీమా బాల్స్ | కీమా బాల్స్ రెసిపీ

Restaurant Style Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 40 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • వెజ్ కీమా బాల్స్ కోసం:
  • 1 cup సొయా గ్రాన్యూల్స్
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • ½ inch దాల్చిన చెక్క
  • ½ tsp అల్లం తరుగు
  • 7-8 cloves వెల్లులి
  • 2 పచ్చిమిర్చి
  • ½ tsp జీలకర్ర
  • ¼ cup సెనగపిండి
  • 2 tbsp కొత్తిమీర
  • పుదీనా (చిన్న పిడికెడు)
  • నూనె (వేపుకోడానికి)
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • గ్రేవీ మసాలా కోసం:
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • ¼ cup జీడిపప్పు
  • 1 tsp గసగసాలు
  • ¼ cup పచ్చి కొబ్బరి
  • 2 పచ్చిమిర్చి
  • 1 tsp ధనియాలు
  • ½ inch దాల్చిన చెక్క
  • నీరు (నానబెట్టుకోడానికి)
  • కుర్మా కోసం:
  • ½ cup ఉల్లిపాయ తరుగు
  • 1 sprig కరివేపాకు (1 రెబ్బ)
  • ½ tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • ¼ tsp పసుపు
  • 2 cups నీరు
  • ¼ cup నూనె
  • పుదీనా ఆకులు (కొద్దిగా)

విధానం

  1. సొయాని నీరు పోసి నానబెట్టి, గట్టిగా నీరు పిండేయండి. కీమా బాల్స్ కోసం ఉంచిన పదార్ధాలని మిక్సర్ జార్లో వేసి అందులో నీరు పిండి సొయా పొడి కూడా వేసి మెత్తగా రుబ్బుకోండి.
  2. మెత్తగా రుబ్బుకున్న సొయా ముద్దలో సెనగపిండి కొత్తిమీర పుదీనా తరుగు వేసి బాగా కలిపి చేతికి నూనె రాసుకుని చిన్న నిమ్మకాయంత ఉండలుగా చేసుకోండి.
  3. మరిగే నూనెలో కీమా ఉండలు వేసి 3-4 నిమిషాలు వదిలేయండి. 3-4 నిమిషాల తరువాత నెమ్మదిగా తిరగేస్తూ ఎర్రగా వేపుకుని తీసుకోండి. అలాగే మిగిలినవి కూడా వేపి తీసుకోండి.
  4. గ్రేవీ కోసం నానబెట్టిన మసాలా దినుసులు అన్ని మిక్సర్ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  5. నూనె వేడి చేసి ఉల్లిపాయ తర్గుగు కరివేపాకు వేసి ఉల్లిని ఎర్రగా వేపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరొక నిమిషం వేపుకోండి.
  6. ఎర్రబడిన ఉల్లిలో మసాలా ముద్దా ఉప్పు నీరు పోసి కలిపి మధ్యమధ్యలో కలుపుకుంటూ 15-20 నిమిషాలు ఉడికించండి.
  7. 15-20 నిమిషాల తరువాత ఎర్రగా వేపుకున్న కీమా ఉండలు వేసి కలిపి ఇంకో 3-4 నిమిషాలు ఉడికించి పైన పుదీనా తరుగు చల్లి దింపేసుకోండి.