వంకాయ పకోడీ

Wedding Style recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 30 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • వంకాయ కోటింగ్ కోసం:
  • 1 Cup ఉల్లిపాయ చీలికలు
  • ఉప్పు (కొద్దిగా)
  • 1/4 tbsp పసుపు
  • 1/2 tbsp జీలకర్ర పొడి
  • 1 tbsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/2 kg చీరుకున్న వంకాయ ముక్కలు
  • 1.5 cup సెనగపిండి
  • 1/4 cup మైదా
  • 1/4 cup కార్న్ ఫ్లోర్
  • 1/4 cup నీళ్లు
  • నూనె వేపుకోడానికి
  • 1/4 cup జీడిపప్పు
  • 1/4 cup వేరుశెనగగుండ్లు
  • పకోడీ టాసింగ్ కోసం:
  • 2 tbsp నూనె
  • 6-7 వెల్లులి
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 2 Sprigs కరివేపాకు
  • 1 ఉల్లిపాయ సన్నని చీలికలు
  • 1/2 cup పచ్చికొబ్బరి
  • 1 tbsp గరం మసాలా
  • 1/2-1 tbsp కారం
  • 1/4 cup కొత్తిమీర
  • 1 tbsp ఆమ్ చూర్ పొడి

విధానం

  1. ఉల్లిపాయల్లో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లులి పేస్ట్ వేసి గట్టిగా గట్టిగా పిండండి
  2. తరువాత వంకాయ ముక్కలు వేసి కలుపుకోండి. ఆ తరువాత సెనగపిండి మైదా కార్న్ ఫ్లోర్ వేసి ముందు వంకాయ ముక్కలని ఎగరేస్తూ టాస్ చేసుకోండి
  3. వంకాయ ముక్కలకి పొడి పిండి పట్టిన తరువాత నీళ్లు కోడి కొద్దిగా చిలకరిస్తూ స్పూన్తో కోట్ చేసుకోండి (కోటింగ్ ఎంతో ముఖ్యం ఒక్క సారి పైన టిప్స్ చుడండి)
  4. మరిగే నూనెలో కొన్ని వంకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద పకోడీ కారకరలాడేట్టు వేపుకుని తీసి జల్లెడలో వేసుకోండి. అలాగే మిగిలిన పకోడీ కూడా వేసి వేపుకోండి.
  5. పకోడీ వేపుకున్నాక జీడిపప్పు పల్లెలు వేపి తీసుకోండి
  6. వెడల్పాటి పాన్లో నూనె వేడి చేసి అందులో వెల్లులి పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఉల్లిపాయ చీలికలు ఒక దాని తరువాత ఒకటి వేసి ఉల్లిపాయాలు ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి
  7. వేగిన తాలింపులో వంకాయ పకోడీ మిగిలిన సామాగ్రీ అంతా వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసి తీసుకోండి.
  8. వడ్డించే ముందు కొద్దిగా ఆమ్‌చూర్ పౌడర్ చల్లుకోండి.