బెల్లం లో కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం కరిగి ఒక పొంగువచ్చాక దింపి చల్లారబెట్టాలి .
పాలు పోసి ఒక పొంగురానిచ్చి, 30 నిమిషాలు నానబెట్టిన గోధుమ నూక వేసి, నీళ్ళు పోసి బాగా కలిపి మూతపెట్టి మెత్తగా ఉడికించాలి.
గోధుమ నూక మెత్తగా ఉడికిన తరువాత అందులో పండిన ఖర్జూరం, బాదాం పలుకులు, యాలకలు, జాజికాయ పొడి వేసి 3-4 నిమిషాలు ఉడికిస్తే పూర్తిగా దగ్గరపడుతుంది.
ఉడికిన గోధుమ నూకలో బెల్లం పాకాన్ని వడకట్టి పాయసంలో కలిపి కొద్దిగా నెయ్యి కుంకుమపువ్వు వేసి బాగా కలిపి నెయ్యి పైకి తేలేదాకా ఉడికించాలి
నెయ్యి పైకి తేలాక మళ్ళీ 2 tbsp నెయ్యి వేసి కలిపితే 4-5 నిమిషాలకి నెయ్యి పైకి తేలుతుంది. ఆఖరుగా మళ్ళీ మిగిలిన నెయ్యి వేసి కలిపి 3 నిమిషాలు ఉడికిస్తే నెయ్యి పైకి తేలుతుంది అప్పుడు దించేయండి.