వైట్ చికెన్ బిర్యానీ | ఈ వైట్ చికెన్ బిర్యానీనే సోఫియాని బిర్యానీ అని కూడా అంటారు

Non Veg Biryanis | nonvegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 30 Mins
  • Resting Time 120 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ నానబెట్టడానికి
  • 1/2 kilo చికెన్
  • 1/2 cup వేపిన ఉల్లిపాయలు
  • 1 tsp అల్లం వెల్లులి ముద్దా
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp యాలకల పొడి
  • 1.5 tsp గరం మసాలా
  • 250 ml కమ్మని పెరుగు
  • 1/4 cup పాల మీగడ
  • 3 పచ్చిమిర్చి (ముక్కలు)
  • 2 tbsp నూనె
  • 2 tbsp జీడిపప్పు పేస్ట్
  • చిన్న కట్ట కొత్తిమీర తరుగు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • చికెన్ ఉడికించడానికి
  • 3 tbsp నెయ్యి
  • 4 యాలకలు
  • 5 లవంగాలు
  • 2 నల్ల యాలక
  • 1 బిరియానీ ఆకు
  • 1 tsp షాహీ జీరా
  • 2 inches దాల్చిన చెక్క
  • 1 tsp అనాస పువ్వు
  • 1/2 tsp సొంపు
  • 300 ml నీళ్ళు
  • రైస్ వండుకోడానికి
  • 2 liters నీళ్ళు
  • 1 tsp షాహీ జీరా
  • 6 యాలకలు
  • 2 inches దాల్చిన చెక్క
  • 6 లవంగాలు
  • 1 tsp షాహీ జీరా
  • 2 tbsp గులాబీ రేకులు / రోస్ వాటర్
  • 1 tsp అల్లం వెల్లులి ముద్దా
  • 3 tbsp ఉప్పు
  • 1 tsp నెయ్యి
  • 4 పచ్చిమిర్చి (తరిగిన ముక్కలు)
  • 1/2 tsp మిరియాలు
  • 1 జాపత్రీ
  • కుంకుమ పువ్వు – చిటికెడు
  • 1.5 cup బాస్మతి బియ్యం (గంట నానబెట్టినది)
  • ధం చేయడానికి
  • 2 tbsp నూనె
  • 1 tbsp నెయ్యి
  • 1/4 cup కుంకుమ పువ్వు పాలు (చిటికెడు కుంకుమ పువ్వు వేసి నానబెట్టిన పాలు)
  • 1/4 cup బియ్యం ఉడికించిన నీళ్ళు

విధానం

  1. చికెన్ నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి చికెన్ని బాగా మసాజ్ చేసి మూత పెట్టి 2 గంటలు ఫ్రిజ్లో ఉంచండి.
  2. పాన్లో నెయ్యి కరిగించి అందులో డ్రై మసాలా అన్నీ వేసి 30 సెకన్లు వేపి, 2 గంటలు నానబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక కుక్ చేసుకోండి.
  3. నూనె పైకి తేలాక 300 ml నీళ్ళు పోసి కలిపి మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలకి గ్రేవీ చిక్కబడుతుంది.
  4. రైస్ కుక్ చేయడానికి నీళ్ళు మరిగించాలి, మరిగే నీళ్ళలో బియ్యం తప్పా అన్నీ వేసి హై ఫ్లేమ్ మీద తెర్ల కాగనివ్వాలి.
  5. మసల కాగుతున్న నీళ్ళలో నానబెట్టిన బియ్యం వేసి హై ఫ్లేమ్ మీదే 60% కుక్ చేసుకోవాలి. 60% ఉడికిన బియ్యాన్ని బిర్యానీ వండే గిన్నెలో రెండు లేయర్స్గా వేసుకోవాలి.
  6. 60% ఉడికిన రైస్ మీద వండుకున్న చికెన్ కర్రీ వేసి సమంగా సర్దుకోవాలి. మరో ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద రైస్ ఉడికిస్తే 70% ఉడికిపోతుంది దాన్ని మరో లేయర్ గా వేసుకోవాలి.
  7. ఇంకో ఐదు నిమిషాలు హై-ఫ్లేమ్ మీద ఉడికిస్తే 80% ఉడికిపోతుంది రైస్, దాన్ని ఆఖరుగా వేసి అన్నాన్ని సమంగా సర్దుకోవాలి.
  8. బిర్యానీ రైస్ మీద నెయ్యి నూనె కలిపి పోసుకోవాలి, తరువాత కుంకుమ పువ్వు పాలు, రైస్ వండుకున్న ఎసరు నీళ్ళు గిన్నె అంచుల వెంట పోసుకోండి.
  9. రైస్ మీద టిష్యూ నాప్కీన్స్ పెట్టి నీళ్ళు చిలకరించి మూత పెట్టి హై –ఫ్లేమ్ మీద 8 నిమిషాలు లో- ఫ్లేమ్ మీద 7 నిమిషాలు ధం చేసి స్టవ్ ఆపేసి పొయ్యిమీదే 20 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తరువాత అడుగునుండి నెమ్మదిగా కలుపుకోవాలి.
  10. ఈ బిర్యానీ మిర్చీ కా సాలన్ ఇంకా కమ్మని రైతాతో ఎంతో రుచిగా ఉంటుంది.