గిన్నెలో నీళ్ళు పోసి అందులో కండ ముక్కలు బచ్చలి ఆకు పసుపు వేసి కంద 90% ఉడికించుకోవాలి. దింపడానికి ముందు ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
ఆవాల పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి నూనె వేసి కలిపి పక్కనుంచుకోండి.
ఉడికిన కందా బచ్చలిని వడకట్టి కచ్చపచ్చగా ఏనుపుకోవాలి. అవసరమనిపిస్తే కందని ఉడికించిన నీరు కొద్దిగా పోసి పలుచన చేసుకోండి.
ఏనుపుకున్నాక పచ్చిమిర్చి చీలికలు, చింతపండు గుజ్జు, ఆవాల పేస్ట్ వేసి బాగా కలిపి ఉంచండి.
తాలింపు కోసం నూనె వేడి చేసి ముందుగా వేరుశెనగప్పుని వేపి మిగిలినవి ఒక్కోటిగా వేసుకుంటూ ఎర్రగా కరకరలాడేట్టు వేపి కూర కలిపి కనీసం గంట సేపు వదిలేస్తే తాలింపు పరిమళం ఆవాల ఘాటు పులుపు కూరకి పట్టి ఎంతో రుచిగా ఉంటుంది.