ఆంధ్రా స్టైల్ రొయ్యల మసాలా
వేపిన రొయ్యల్లో ఉల్లిపాయ గుజ్జు ఉప్పు కారం మసాలాలో నెమ్మదిగా ఉడికించి కొత్తిమీర చల్లి చేసే ఆంధ్రా స్టైల్ రొయ్యల మసాలా రెసిపీ బ్యాచిలర్స్ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారితో కూడా సులభంగా చేసేయగలరు.
రొయ్యల మసాలా చాలా తీరుల్లో ప్రాంతానికి తగినట్లుగా చేస్తారు. నేను చేస్తున్నది ఆంధ్రా స్టైల్. ఈ రొయ్యల కూర దగ్గరగా ముద్ద కూరల ఉంటుంది. ఘాటుగా కారంగా అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
సాధారణంగా రొయ్యల మసాలా కూరలో అంటే చాలా మంది టమాటో వేస్తారు, ఈ తీరులో టమాటో లేదు. కేవలం ఉల్లిపాయ గుజ్జు మాత్రమే. ఇంకా రొయ్యల కూరలో చాలా మంది చేసే పొరపాటు రొయ్యలు రబ్బరులా సాగడం. నా తీరులో నా స్టీపీలో చేస్తే రొయ్యలు చాలా మృదువుగా ఉంటాయి, అస్సలు నీచు వాసనా రాదు.
బెస్ట్ రొయ్యల మాసాల కూర కోసం కింద టిప్స్ చుడండి.

టిప్స్
రొయ్యలు:
-
నేను మీడియం సైజు చెరువు రొయ్యలు వాడుతున్నాను. మీకు నచ్చితే టైగర్ ప్రాన్స్ కూడా వాడుకోవచ్చు.
-
రొయ్యలకి ఉప్పు పసుపు పట్టించి కనీసం ఒక అర గంట ఊరనిస్తే ముక్కకి ఉప్పు పడుతుంది.
-
రొయ్యలు నూనెలో వేసిన తరువాత నీరు వదులుతుంది. ఆ తరువాత 4 నిమిషాలు వేపిస్తే చాలు 50% వేగిపోతాయ్. ఆ వెంటనే తీసి పక్కనుంచుకొండి. మిగిలినది మసాలాలో మగ్గిపోతుంది. ఈ తీరులో చేస్తే రొయ్యలు మసాలాలని పీల్చి మృదువుగా ఉంటాయి.
నూనె:
మాంసాహారాలకి నూనెలుండాలి అప్పుడే రుచి
టమాటో:
నేను ఇందులో టమాటో వేయలేదు. ఇది మా ఇంట్లో మేము చేసుకునే తీరు. నచ్చితే మీరు 2 టమాటో సన్నని తరుగు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేదాకా వేపుకోండి. కానీ కొద్దిగా ఉప్పు కారం ఎక్కువగా వేసుకోండి.
ఆఖరుగా ఇంకొన్ని :
-
మసాలా కూర అంటే పలుచగా జారుగా ఉండకూడదు. కాస్త చిక్కగా కుర్మా మాదిరి ఉండాలి.
-
కూర చేదోచ్చింది అంటే మసాలాలు మాడడం వల్ల లేదా మసాలాలు ఎక్కువ అవడం ఈ రెండే కారణాలు. ఒక వేళా అలా అయితే ఆఖరున కొద్దిగా నిమ్మరసం పిండేయండి.
ఆంధ్రా స్టైల్ రొయ్యల మసాలా - రెసిపీ వీడియో
Andhra Style Spicy Prawns Masala Curry | How to Make Prawns Masala Fry
Prep Time 2 mins
Cook Time 20 mins
Resting Time 30 mins
Total Time 52 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 250 gms కడిగి శుభ్రం చేసిన రొయ్యలు
- ఉప్పు - కొద్దిగా
- 1/4 tsp పసుపు
-
ఉల్లిపాయ పేస్ట్ కోసం
- 2 ఉల్లిపాయ ముక్కలు
- 4 పచ్చిమిర్చి
- అల్లం - అంగుళం
- 8 వెల్లులి
-
మసాలా కూర కోసం
- 1/4 cup నూనె
- 2 రెబ్బలు కరివేపాకు
- 1 tsp కారం
- 1 tsp ధనియాల పొడి
- 1 tsp జీలకర్ర పొడి
- ఉప్పు
- 1/2 tsp గరం మసాలా
- కొత్తిమీర - చిన్నకట్ట
విధానం
-
రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి కనీసం అరా గంట పక్కనుంచుకోండి.
-
మిక్సీ జార్లో ఉల్లిపాయ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనె వేసి చేసి అందులో నానబెట్టిన రొయ్యలు వేసి 50% వేపుకుని తీసుకోండి (50% వేపడం ఎలాగో టిప్స్ చుడండి).
-
మిగిలిన నూనెలో ఇంకొంచెం నూనె వేసి కరివేపాకు వేసి వేపి ఉల్లిపాయ గుజ్జు వేసి నూనె పైకి తేలేదాక కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయ పేస్టులో కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు వేసి వేపి వెంటనే నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
-
మరుగుతున్న ఎసరులో సగం పైన వేపుకున్న రొయ్యలు వేసి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడనివ్వాలి.
-
కూర ముద్దగా దగ్గర పడ్డాక గరం మాసాలా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
8 comments