మునక్కాడ స్వీట్ కార్న్ పాలు కూర | మునక్కాడ స్వీటీకార్న్ కర్రీ | మునక్కాడ కర్రి
మునక్కాడ స్వీటీకార్న్ పాలు కూర తాలింపు పెట్టి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసి మగ్గించి కొబ్బరి పాలు ఉడికించిన మునక్కాడలు స్వీట్ కార్న్ వేసి కొత్తిమీర వేసి దింపే కమ్మని కూర అన్నంతో అమృతంలా ఉంటుంది. నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపించేలా చేస్తుంది.
సాధారణంగా గేదె పాలు పోసి చేసుకునే కూరలు తెలుగు వారికి ఎంతో ఇష్టం, అందులోను బీరకాయతో ఎక్కువగా చేస్తుంటారు. మా అమ్మ మా చిన్నప్పుడు గేదె పాలు పోసి బీరకాయ సొరకాయ కూరలు చేసే వారు, ఎంతో ఇష్టంగా తినే వాళ్ళం. కానీ ఇప్పుడు పాలు ఉప్పు కలిపి వండినది విరుద్ధ ఆహారం అవుతుంది తినకూడదు అంటున్నారు, కాబట్టి అందుబాటులో ఉన్న కొబ్బరి పాలు వాడి ఈ కూర చేస్తున్నాను. నేను వివరించి చెప్పడం కాదుగాని తింటే మీరే అంటారు అద్భుతం అని.

టిప్స్
మునక్కాడ:
-
మునక్కాడ నేను లేతవి వాడుకున్నాను. మీరు కాస్త ముదురువి కండగలిగినవి వాడుతున్నట్లైతే నారా ఎక్కువగా తీసి ఉడికించుకోండి.
-
మునక్కాడ 80% ఉడికితే చాలు మిగిలినది కొబ్బరి పాలల్లో ఉడికిపోతుంది.
స్వీట్ కార్న్:
- మునక్కాడ సగం ఉడికిన తరువాత స్వీట్ కార్న్ వేసుకుంటే కార్న్ ఉడికేలోగా మునక్కాడ ఉడికిపోతుంది.
కొబ్బరి పాలు:
- నేను ఈ రెసిపీకి మునక్కాడ స్వీట్ కార్న్ ఉడికించిన నీటిని చల్లార్చి ఆ నీతితో కొబ్బరి పాలు తీసుకున్నాను.
మునక్కాడ స్వీట్ కార్న్ పాలు కూర | మునక్కాడ స్వీటీకార్న్ కర్రీ | మునక్కాడ కర్రి - రెసిపీ వీడియో
Munakkada Sweet Corn Coconut Milk Curry | Drumstick Sweet Corn Curry
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
కూరకి కావలసినవి:
- 12-15 pieces మునక్కాడలు (2 అంగుళాలు ముక్కలు)
- 1/3 cup స్వీట్ కార్న్
- 1 cup నీరు
-
కొబ్బరి ముద్ద కోసం:
- 1/4 cup పచ్చి కొబ్బరి
- 5-6 పచ్చిమిర్చి
- 10-12 వెల్లులి
-
తాలింపు కోసం:
- 2 tbsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1 tsp పచ్చిశెనగపప్పు
- 1 ఎండుమిర్చి
- 1 sprig కరివేపాకు
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 1/4 tsp పసుపు
- ఉప్పు - కొద్దిగా
- 1 cup కొబ్బరి పాలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
విధానం
-
మునక్కాడ ముక్కలని నీరు పోసి మూతపెట్టి ఉడికించుకోండి. మునక్కాడ సగం ఉడికిన తరువాత స్వీట్ కార్న్ వేసి స్వీట్ కార్న్ ని మెత్తగా ఉడికించుకోండి.
- ఉడికిన మునక్కాడ స్వీట్ కారం ని వడకట్టి, వడకట్టిన నీటితో కొబ్బరి పాలు తీసుకోండి.
-
మిక్సీలో బెత్తెడు పచ్చికొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వెల్లులి వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగప్పు, ఎండుమిర్చి కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేపుకోండి.
-
వేగిన తాలింపులో ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిని మెత్తబడనిస్తే చాలు.
-
ఆ తరువాత ఉడికించుకున్న మునక్కాడ స్వీట్ కార్న్ కొబ్బరి ముద్దా పసుపు వేసి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోండి.
-
మునక్కాడ ఉడికిన తరువాత మునక్కాడని ఉడికించుకున్న నీటితో తీసిన కొబ్బరి పాలు పోసి కలిపి మూతపెట్టి దగ్గరగా ఉడికించుకోండి.
-
దింపబోయే ముందు ఉప్పు కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
1 comments