రాగి దలియా | రాగి దలియా ఎంతో ఆరోగ్యకరమైన ఓ రెసిపీ

పిల్లల నుండి పెద్దల దాకా అందరికీ పోషకాలు నిండిన ఆహారం ఉండే రెసిపీ ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటున్నారా అయితే ఈ రాగి దలియా మీ కోసమే!

రాగి దలియా ఎంతో ఆరోగ్యకరమైన ఓ రెసిపీ. ఇది ఆరు నెలల పసిపాప నుండి 80 ఏళ్ళ వయసున్న వారు కూడా తినొచ్చు. పోషకాలతో నిండిన రుచికరమైన రెసిపీ. లంచ్ బాక్సులకి, డిన్నర్కి లేదా హెల్తీ గా ఏదైనా తిందామనుకున్నా రాగి దలియా బెస్ట్!

ఇది బరువు తగ్గాలనుకునే వారు, కాల్షియమ్ తక్కువున్న వారు, ఎదుగుతున్న పిల్లలు, బీ పీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా రోజూ తినొచ్చు. ఓ నెల పాటు తిని చుడండి ఎంత గుణం కనిపిస్తుందో మీలో. ఈ హెల్తీ దలియా తిన్నకా అస్సలు మత్తుగా అనిపించదు.

టిప్స్

• రాగి పిండి కంటే కూడా మొలకెత్తిన రాగి పిండి ఉంటె మరీ మంచిది.

• సామ బియ్యానికి బదులు మీరు కొర్రలు, జొన్నలు, గోధుమ నూక, లేక మరింకేదైనా ధాన్యాలు వాడుకోవచ్చు

• సామ బియ్యం కచ్చితంగా 2-3 గంటలు నానా బెట్టాలి అప్పుడే మెత్తగా ఉడుకుతుంది. కొర్రలు లేదా మరింకేదైనా మిల్లెట్స్ వాడేట్లయితే కనీసం 3-4 గంటలు లేదా రాత్రంతా నానాలి అప్పుడే మెత్తగా ఉడుకుతుంది.

• కందిపప్పుకి బదులు కందులు వాడుకోండి ఇంకా బావుంటుంది రుచి.

• పొడి కాస్త ఎక్కువగా చేసుకుని నిలవ చేసుకోవచ్చు.

రాగి దలియా | రాగి దలియా ఎంతో ఆరోగ్యకరమైన ఓ రెసిపీ - రెసిపీ వీడియో

Finger Millets Kichidi | Ragi Dalia | Healthy Recipe | Best Millet Kichidi recipe | How to make Ragi Dalia

Millet Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 4 hrs
  • Cook Time 30 mins
  • Total Time 4 hrs 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 3 tbsps రాగి పిండి
  • 3 tbsps వేరుసెనగపప్పు
  • 3 tbsps సామ బియ్యం/కొర్ర బియ్యం (రెండు గంటలు నానబెట్టినది)
  • 3 tbsps కందిపప్పు
  • 1/2 tsp జీలకర్ర
  • 1/2 tsp ధనియాలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 4 - 5 వెల్లూలి
  • 1 పచ్చిమిర్చి తరుగు
  • 1/2 కట్ట తోటకూర
  • 400 ml నీళ్ళు
  • 1 tsp నెయ్యి
  • సైంధవ లవణం- రుచికి సరిపడా

విధానం

  1. రాగిపిండి లో ఎక్కడా ఉండలు లేకుండా 100ml నీళ్ళు పోసుకుని బాగా కలిపి పక్కనుంచుకోండి.
  2. పొడి కోసం ఇప్పుడు బాండీ లో వేరుసెనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వెల్లూలి ఒక్కొటిగా వేసుకుంటూ లో ఫ్లేం మీద వేపుకుని చల్లార్చుకోండి.
  3. చల్లారాక మిక్సి జార్ లో వేసి కాస్త బరకగా పొడి చేసుకోండి.
  4. దలియ కోసం 300 ml నీళ్ళు మరిగించుకుని కాస్త జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న సామ బియ్యం, పచ్చిమిర్చి తరుగు, తోటకూర తరుగు వేసి మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేం మీద ఉడకనివ్వండి.
  5. ఆ తరువాత రాగి పిండి మిశ్రమాన్ని కలిపి పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేం మీద కాస్త దగ్గర పడనివ్వండి.
  6. దగ్గరపడ్డాక వేరుసెనగ కందిపొడి, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగ కలుపుకుని మూతపెట్టి 3-4నిమిషాలు లో ఫ్లేం లో మూత పెట్టి ఉడకనివ్వండి.
  7. దింపే ముందు 1 tsp ఆవు నెయ్యి, 1/2 చెక్క నిమ్మ రసం వేసి కలుపుకుని వేడి వేడి గా సర్వ్ చేసుకోండి.
  8. ఈ దలియా ఏ నంజుడు లేకపోయినా చాలా రుచిగా ఉంటుంది లేదా పెరుగు చట్నీతో ఇంకా బాగుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments