రాగి మునగాకు రొట్టె

కేవలం రెండే నిమిషాలు పిండి కలపడానికి, పిండి నానడానికి ముప్పై నిమిషాలు రోరె కాల్చడానికి 7-8 నిమిషాలు అంతే ఒక అద్భుతమైన ఆరోగ్య ఘని రాగి మునగాకు రొట్టెని ఆస్వాదించడానికి!!!

రాగి పిండి మునగాకు వేసి వేడి నీళ్లతో తడిపి చేసే రొట్టె రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!!! ఈ రాగి మునగాకు రోటీ వెనుకటి కాలం రెసిపీ. కమ్మని రోటి పచ్చడి ఉంటె చాలు పర్ఫెక్ట్ గా ఉంటుంది.

ఈ రాగి మునగాకు రొట్టె రెసిపీ నేను చిత్తూర్ వైపు చేయడం చూశాను, మేము తిరుపతి వెళ్ళినప్పుడు కాళహస్తిలో పూజలకు రెండు రోజులున్నాం అక్కడ సాయంత్రం ఒక చిన్న అంగడిలో ఒక పెద్దావిడ ఈ రొట్టెలు కాలుస్తుంది, చాలా రుచిగా అనిపించాయి. కాకపోతే ఆ బామ్మ అక్కడిక్కడే పిండి కలిపి రొట్టె కాలుస్తుంది, కాబట్టి రెసిపీ దగ్గరుండి చూసే అవకాశం దొరికింది.

తరువాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇదే రెసిపీ తమిళనాట సాయంత్రాలు ఎక్కువగా చేసుకుంటారని. అయితే కాళహస్తిలో అవ్వ పచ్చి కొబ్బరి వేయలేదు, తమిళులు మాత్రం పచ్చి కొబ్బరి వేసి మిగిలినదంతా కాళహస్తిలో బామ్మా గారి తీరులోనే చేసి రాగి అడై అని పిలుస్తారు.

మీరు ఈ రెసిపీని కూడా చేయవచ్చు రవ్వ పరోటా

అయినా తమిళనాడుకు బోర్డర్లో ఉన్న చిత్తూర్ వంటకాలు చాలా వరకు తమిళ వంటకాలకు దగ్గరగా ఉంటాయి.

టిప్స్

రాగి పిండి:

  1. నేను రెడీమేడ్గా దొరికే రాగిపిండి వాడాను. మీరు నచ్చితే మొలకల రాగి పిండి కూడా దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు, లేదా మరింకేదైనా మిల్లెట్ పిండి వాడి చేసుకోవచ్చు.

మునగాకు:

  1. కాడలు లేని లేత మునగాకు వాడుకోడానికి ప్రయత్నం చేయండి, రుచి బాగుంటుంది.

పిండి కలిపే తీరు:

  1. రాగి పిండిని వేడి నీలాల్తో కలిపితే కాస్త మగ్గుతుంది పిండి, ఇంకా పిండి 30 నిమిషాలు అయినా నానితే రొట్టె కాస్త మృదువుగా ఉంటుంది.

రొట్టె కాల్చే తీరు:

  1. రొట్టెని నిదానంగా కాల్చాలి, సుమారు 7-8 నిమిషాల సమయం పడుతుంది ఒక రొట్టె కలడానికి, నూనె కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది.

రొట్టె వత్తె తీరు:

  1. బోర్లించిన కుండా లేదా గుండ్రంగా ఉండే గిన్నె మీద తడి గుడ్డ కప్పి చేతికి నూనే లేదా నీరు పూసి పెద్ద పిండి ముద్దని కుండా మీద వేసిన తడి బట్ట మీద నెమ్మదిగా తట్టుకుంటూ ⅛ ఇంచ్ మందాన వత్తుకోవాలి.

  2. చేతికి నూనె గాని నీరు గాని లేకుంటే జిగురులేని రాగి పిండి విరిగిపోతుంది. రొట్టె పల్చగా వత్తాక తడి గుడ్డతో సహా తీసి పెనం మీద వేసి గుడ్డ తీసి కాల్చుకోవాలి.

రాగి మునగాకు రొట్టె - రెసిపీ వీడియో

Ragi Moringa Roti | Ragi Munagaaku Rotte Recipe | Ragi Roti recipe

Rotis Paratha | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 20 mins
  • Total Time 22 mins
  • Serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 2 Cups రాగి పిండి
  • 1 cup మునగాకు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 3-4 ఎండుమిర్చి ముక్కలు
  • ఉప్పు
  • 1/4 cup పచ్చి కొబ్బరి తురుము
  • 1 tbsp వెల్లులి
  • వేడి నీళ్లు (తగినన్ని)
  • నూనె (రొట్టె కాల్చడానికి)

విధానం

  1. రాగి పిండిలో రొట్టెకి కావలసిన పదార్ధాలన్నీ వేసి వేడి నీళ్లతో పిండిని మృదువుగా కలుపుకోవాలి.
  2. వేడి నీరు పోసి చెంచాతో కలుపుకున్నాకా చేత్తో గట్టిగా ఉల్లి మునగాకుకి నలుపుతూ కలుపుకోండి. తరువాత 30 నిమిషాలు నానబెట్టుకోండి
  3. కుండా లేదా గిన్నెని బోర్లించి దాని మీద తడి క్లాత్ కప్పి బత్తాయి పండంత పిండి ముద్దని బట్ట మధ్యన పెట్టి నూనే రాసుకున్న చేత్తో నెమ్మదిగా తట్టుకొండి. (చేయి కచ్చితంగా తడిగా లేదా నూనె రాసుకుని ఉండాలి లేదంటే రొట్టె విరిగిపోతుంది)
  4. తట్టుకున్న రొట్టెని క్లాత్తో సహా తీసి వేడి పెనం మీద వేసి క్లాత్ తీసి ఒక నిమిషం మీడియం ఫ్లేమ్ మీద ఒక వైపు కాలనివ్వాలి
  5. రొట్టె ఒక కాస్త కాలిన తరువాత రొట్టె అంచులకి రొట్టె పైన నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీదే నెమ్మదిగా కాల్చుకోవాలి. లేదంటే రొట్టె పచ్చిగా ఉంటుంది.
  6. నూనె రొట్టె అంతా పూసి కాల్చండి, అప్పుడే రొట్టె చల్లారిన మృదువుగా ఉంటుంది. లేదంటే గట్టిగా అయిపోతాయి. రెండు వైపులా కాల్చుకున్న రొట్టెని తీసి ఏదైనా కరం పచ్చడితో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.