“రవ్వ పరోటా” దూదిలా మెత్తగా, వెన్నలా కరిగిపోతాయ్! బొంబాయి రవ్వతో ఎప్పుడూ ఉప్మానే కాదండి పొద్దున్నే టిఫిన్కి లేదా పిల్లల లంచ్ బాక్స్ కి ఇది చేసి పంపొచ్చు. చాలా ఇష్టంగా తింటారు!

ఇవి గంటల తరువాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇవి ఏదైనా కారంగా ఉండే కుర్మా, లేదా రోటి పచ్చళ్ళతో చాలా రుచిగా ఉంటాయ్.

Semolina Parota | Rava Parota | Suji Parota | How to make Rava Paratha

టిప్స్

పరాటాలు విరగకుండా రావాలంటే?

• రవ్వ ని ఎక్కువ సేపు వత్తుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వత్తుకోవాలి. ఇంకా రవ్వని ఉడికించేప్పుడు అడుగు పడితే ఆ పెచ్చులు రవ్వ ముద్దలో చేరి పరోటాలో పలుకులుగా ఉండిపోతాయ్.

• రవ్వలో మైదా గోధుమ పిండి ఏదైనా వాడుకోవచ్చు. రవ్వని ఉడికించేప్పుడు వేసే నీటిని బట్టి పిండి పెరగవచ్చు తగ్గవచ్చు. కానీ పిండి మరీ ఎక్కువ వేస్తే పరోటాలు అంత రుచిగా రావు.

• ఉడికించిన రవ్వ పిండిని ఎంత ఎక్కువసేపు వత్తుకుంటే అంత జిగురు వచ్చి పరోటా విరగదు.

ఎలాంటి రవ్వ వాడాలి?

• సన్నని రవ్వ దొరికితే వాడుకోవచ్చు. లేదా రవ్వని మిక్సీ పట్టి వాడుకోవాలి.

పరోటా మృదువుగా ఉండాలంటే

• పరోటాని నెయ్యి లేదా నూనెతో కాల్చుకోవచ్చు. నెయ్యితో కాలిస్తే చాలా రుచిగా ఉంటాయ్.

• కాల్చుకున్న పరోటాని వెంటనే హాట్ బాక్స్ లేదా తడిపి గట్టిగా నీటిని పిండిన క్లాత్ తో కప్పి ఉంచాలి.

రవ్వ పరోటా - రెసిపీ వీడియో

Semolina Parota | Rava Parota | Suji Parota | How to make Rava Paratha

Rotis Paratha | vegetarian
  • Cook Time 20 mins
  • Resting Time 5 mins
  • Total Time 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బొంబాయి రవ్వ/ఉప్మా రవ్వ
  • 1 3/4 cup నీళ్ళు
  • మైదా/గోధుమ పిండి
  • ఉప్పు
  • నెయ్యి పరాటాలు కాల్చడానికి

విధానం

  1. రవ్వని మిక్సీ లో వేసి ఓ నిమిషం పాటు గ్రైండ్ చేసి తీసుకోండి. (సహజంగా బజార్ లో దొరికే రవ్వ అంత సన్నగా ఉండదు అందుకే ఇలా చేయాలి).
  2. నీళ్ళలో ఉప్పేసి తెర్ల కాగానివ్వండి.
  3. నీళ్ళు మసిలాక అప్పుడు రవ్వ కొద్దిగా వేస్తూ గరిటతో కలుపుతూ మీడియం ఫ్లేం మీద గట్టి ముద్ద అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి.
  4. గట్టి ముద్దయ్యాక ఓ ప్లేట్ లోకి తీసుకుని ఓ నిమషం చల్లార్చాలి.
  5. ఆ తరువాత కొద్దిగా మైదా చల్లుకుని వేడి మీదే బాగా ఎక్కువ సేపు నీళ్ళు చల్లకుండా పిండి ముద్దని వత్తుకోవాలి (రవ్వలో ఉన్న నీరు సరిపోతుంది).
  6. వేడి పట్టలేకపోతే తడి గుడ్డ కప్పి గుడ్డ తో సహా వత్తుకోవచ్చు, లేదా సిలికాన్ మ్యాట్ అని ఆన్లయిన్ లో లేదా బేకరీ స్టోర్స్ లో దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు.
  7. 7. పిండి ముద్దలో ఎక్కడా పగుళ్ళు లేకుండా ఎక్కువసేపు వత్తుకోవాలి కొద్దికొద్దిగా మైదా చల్లుకుంటూ. (మైదా నాకు తీసుకున్న ½ కప్ పిండి కి ఇంకా 2 tsps మిగిలింది, మీరు రవ్వ ని వండుకునే దాన్ని బట్టి మైదా అవసరం అవుతుంది. కానీ ఎంత తక్కువ మైదా వాడితే అంతే బాగుంటుంది).
  8. ఇప్పుడు పొడి మైదా చల్లి పిండి ముద్దని ఉంచి అప్పడాల కర్రతో నిదానంగా అంచులు పల్చగా వత్తుకోవాలి.
  9. పెనం బాగా వేడెక్కాక పరాట వేసి రెండు వైపులా కాస్త కాల్చి ఆ తరువాత ½ చెంచా చొప్పున రెండు వైపులా నెయ్యి పూసి ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Semolina Parota | Rava Parota | Suji Parota | How to make Rava Paratha