పరటా అంటే ఇష్టపడే వారికి తప్పక నచ్చే బెస్ట్ పరోటా “ఆలూ గోబీ పరోటా”. ఆలూ గోబీ పరోటా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

పరాటాలు దాదాపుగా ఒకే తీరులో చేస్తారు, కానీ లోపలి స్టఫ్ఫింగ్లో చేసే మార్పులతోనే పరాటాని ఎన్నో తీరుల్లో అందరికీ నచ్చేలా చేయవచ్చు.

చూడడానికి నిజానికి కింగ్ ఆఫ్ ఆల్ పరాటాస్ ఆలూ పరాటాలానే ఉంటుంది ఈ ఆలూ గోబీ పరాటా కూడా. కానీ రుచి చాలా భిన్నంగా ఉంటుంది, ఇంకా లోపలి స్టఫ్ఫింగ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పరోటాతో నంజుడుకి కమ్మని పెరుగు, ఆవకాయ పచ్చడి చాలు.

ఈ పరాటా రెసిపీలో పరాటా పగలకుండా ఎలా వత్తుకోవాలి లాంటి టిప్స్తో చెప్తున్నా.

Aloo Gobi Parota

టిప్స్

ఆలూ:ఆలూని ఉడికించి పొత్తు తీసి గాలికి పూర్తిగా చల్లారాక తురుముకుంటే ఆలూలోని చెమ్మ తగ్గుతుంది.

కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ చాలా సన్నగా రవ్వలా తురుముకుంటే బాగుంటుంది.

గోధుమ పిండి:నేను పూర్తిగా గోధుమ పిండి వాడి చేశాను, మీకు దాభా స్టైల్ కావాలంటే మైదా వాడుకోండి, లేదా సగం గోధుమ సగం మైదా వాడుకోవచ్చు.

గోధుమ పిండిని తగినన్ని నీళ్ళు చేర్చుకుంటూ ఎక్కువసేపు పగుళ్లు లేకుండా నున్నగా మృదువుగా అయ్యేదాక వత్తుకోవాలి. అలా వత్తుకుంటేనే స్టఫ్ చేశాక పరోటా పగలదు, పిండి సాగుతుంది.

నూనె :నిజాన్ని నిజంగా అనుకుంటే పరోటాలు నూనె-నెయ్యి లాంటివి ఎక్కువగా వేసి కాలిస్తేనే రుచి, అప్పుడే ధాబా లేదా రెస్టారెంట్ స్టైల్ పరోటాల రుచి వస్తుంది. వొద్దనుకుంటే నూనెలు తగ్గించుకోవచ్చు.

ఆలూ గోబీ పరోటా - రెసిపీ వీడియో

Aloo Gobi Parota | Gobi Paratha | Punjabi Gobi ka Paratha | Potato Cauliflower Stuffed Paratha

Rotis Paratha | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • పిండి కోసం
  • 1.5 cup గోధుమ పిండి
  • ఉప్పు
  • 1 tsp నూనె
  • నీళ్ళు తగినన్ని
  • స్టఫ్ఫింగ్ కోసం
  • 1 tbsp నూనె
  • 1 tsp అల్లం తురుము
  • 1 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • పసుపు – చిటికెడు
  • 1 cup కాలీఫ్లవర్ తురుము
  • 1/2 tsp చాట్ మసాలా
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp కారం
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 1 cup ఉడికించి తురుముకున్న ఆలూ
  • 1/2 tsp నిమ్మరసం

విధానం

  1. పిండిలో ఉప్పు నూనె వేసి బాగా రుద్దితే బ్రెడ్ పొడిలా అవుతుంది, ఆ తరువాత తగినన్ని నీళ్ళు చేర్చి పగుళ్లు లేని మృదువైన పిండి ముద్దగా అయ్యేదాక వత్తుకోవాలి, వత్తుకున్నాక 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
  2. ముకుడులో నూనె వేడి చేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, పసుపు వేసి 30 సెకన్లు వేపి, కాలీఫ్లవర్ సన్నని తురుము వేసి చెమ్మారి పచ్చి వాసన పోయేదాక వేపుకోవాలి.
  3. తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి ఆలూలోని చమ్మారి గట్టి ముద్దగా అయ్యేదాక కలుపుతూ వేపుకోండి, దింపేముందు నిమ్మరసం పిండి కలిపి దింపి పూర్తిగా చల్లారనివ్వాలి.
  4. 30 నిమిషాల తరువాత నానుతున్న పిండిని 4 భాగాలుగా చేసుకోండి, తరువాత చేత్తో పిండిని పలుచగా సాగదీసి అందులో పూర్తిగా చల్లారిన ఆలూ ముద్ద 3 tbsp పెట్టి అంచులని పైకి లాగి స్టఫ్ఫింగ్ని లోపలికి తోస్తూ గట్టిగా సీల్ చేయాలి.
  5. పొడి పిండి చల్లి పిండి ముద్దని ముందు చేతి వేళ్ళతో లోపలి స్టఫ్ఫింగ్ని సమంగా అన్ని వైపులా సర్ది, నెమ్మదిగా వత్తుకోవాలి.
  6. వత్తుకున్న పరోటాని వేడి పెనం మీద వేసి పొంగనివ్వాలి, పొంగిన తరువాత తిప్పి మరో వైపు కాలనిచ్చి ఆ తరువాత రెండు వైపులా నూనె లేదా వెన్న వేసి ఎర్రగా కాలనిస్తే చాలా రుచిగా ఉంటుంది పరోటా.
  7. ఈ పరోటా కమ్మని చల్లని పెరుగు, ఆవకాయతో చాలా బాగుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Aloo Gobi Parota