మెత్తని మృదువైన చపాతీ అంటే అందరికీ ఇష్టమే! అదే మృదువైన చపాతీ ఇంకాస్త రుచిగా చేస్తే ప్రేత్యేకంగా చెప్పాలా లంచ్ బాక్సులకి డిన్నర్కి పర్ఫెక్ట్ అవునా కాదా!!! ఈ సింపుల్ ఉల్లిపాయ చపాతీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి

ఎప్పుడు నేను చపాతీ చేసినా గట్టిగా అవుతున్నాయి అనే కంప్లైంట్ వినపడుతుంది. కానీ గోధుమ పిండితో చేసే ఈ ఉల్లిపాయ చపాతీ ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ ఈసీ చపాతీ గంటల తరువాత కూడా మృదువుగా రెండు వేళ్ళతో తుంచుకు తినేంత మెత్తగా ఉంటాయ్.

ఇంకా ఈ చపాతీకి నంజుడుగా ఏమి అవసరం లేదు, కమ్మని పెరుగు పచ్చడి లేదా కమ్మని పెరుగులో ఉప్పు, వేపిన జీలకర్ర పొడి వేసి కలిపిన పెరుగుంటే చాలు.

టిప్స్

ఈ చపాతీకి పిండి కలపడానికి నీరు చాలా తక్కువుగా అవసరమవుతుంది. ఉల్లిపాయాల్లో నీరు ఉండటాన తక్కువ నీరు వేసినా సరిపోతుంది.

ఉల్లిపాయ చపాతీ - రెసిపీ వీడియో

Onion Chapathi | Easy Soft Chapati | Onion Paratha | Pyaz Ka Paratha

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Total Time 5 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 2 cups గోధుమ పిండి
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1/2 cup సన్నని ఉల్లికాడలు
  • 1.5 tbsp పచ్చిమిర్చి సన్నని తురుము
  • ఉప్పు
  • 1 tsp గరం మసాలా
  • 1 tsp కారం
  • నీళ్ళు – తగినన్ని
  • నూనె – కాల్చుకోడానికి

విధానం

  1. గోధుమ పిండిలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి పిండి మృదువుగా అయ్యేదాక ఎక్కువ సేపు వత్తుకోవాలి.
  2. వత్తుకున్న పిండిని గుడ్డ కప్పి 30 నిమిషాలు నానాబెట్టాలి
  3. నానిన పిండిని ఉండలుగా చేసి పొడి పిండి చల్లి చపాతీల మాదిరి వత్తుకోవాలి.
  4. వత్తుకున్న పిండిని ముద్దని పెనం మీద వేసి రెండు వైపులా కాల్చి తరువాత నూనె వేసి కాల్చుకోవాలి.
  5. ఈ చపాతీలు కమ్మని పెరుగు లేదా నచ్చిన కూర్మతో తినవచ్చు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Yummy yummy
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Amazing. The first time I make chapattis. What a perfect ratios of ingredients. As narrated, it’s nee not any side dishes. I simply ate five chapattis with plain curd while baking itself. I can’t find time add fried jeera powder and salt.
  • A
    anusha g
    How much salt on an average we should add please
  • R
    Rekha
    Recipe Rating:
    Try chesanu my children loved this recipe