తిరుమల తిరుపతి అన్నప్రసాద ఆలయం స్పెషల్ కొబ్బరి పచ్చడి

తిరుమల తిరుపతి అన్నప్రసాద ఆలయం స్పెషల్ కొబ్బర పచ్చడి పచ్చి కొబ్బరిని ఎర్రగా వేపి అందులో వేపిన ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, వేపిన పచ్చి సెనగపప్పు వేసి మెత్తగా రుబ్బిన పచ్చడిని తిరుమల కొండ మీద తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద ఆలయంలో నిత్యాన్నదానంగా వడ్డిస్తారు.

చూడ్డానికి మామూలు కొబ్బరి పచ్చడిలాగే అనిపిస్తుంది కానీ తిరుమల ఆలయం స్పెషల్ కొబ్బరి పచ్చడి రుచి చాలా గొప్పగా ఉంటుంది. ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా ఈ పచ్చడి ఫ్రిజ్లో కనీసం 4-5 రోజులు నిల్వ కూడా ఉంటుంది.

టిప్స్

పచ్చి కొబ్బరి:

  1. తిరుమలలో కొన్ని వందల కిలోలలో పచ్చడి చేస్తారు కాబట్టి వారు పచ్చి కొబ్బరి ముక్కలని నూనెలో ఎర్రగా వేపి తీస్తారు. నేను ఆ రుచి రావాలనే నూనెలో ఎర్రగా వేపి తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగా నూనె వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలని ఎర్రగా వేపి తీసుకోవచ్చు.

  2. మీరు నూనెలో గారెల మాదిరి ఎర్రగా వేపుకున్నా పెద్దగా నూనె పీల్చావు కొబ్బరి ముక్కలు. ఇలా నూనెలో ఎర్రగా వేపుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది.

తిరుమల తిరుపతి అన్నప్రసాద ఆలయం స్పెషల్ కొబ్బరి పచ్చడి - రెసిపీ వీడియో

Tirumala Tirupati Annadanam Temple Special Coconut Chutney

Prasadam | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • కావలసినవి:
  • 200 grams పచ్చి కొబ్బరి ముక్కలు
  • 18-20 ఎండు మిర్చి
  • 2 tbsp పచ్చిశెనగపప్పు
  • చింతపండు - నిమ్మపండంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • తాలింపు కోసం:
  • 2 tsp నూనె
  • 1 tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 2 pinches ఇంగువ
  • కరివేపాకు - కొద్దిగా
  • ¼ tsp పసుపు

విధానం

  1. పచ్చి కొబ్బరి ముక్కలని నూనె లో వేసి ఎర్రగా వేపి తీసి జల్లెడలో వేస్తే నూనె అంతా దిగిపోతుంది జల్లెడలోంచి.
  2. అదే నూనెలో పచ్చి సెనగపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. ఆ తరువాత ఎండుమిర్చి వేసి పొంగించి తీసుకోండి.
  3. వేపుకున్న పదార్ధాలు నానబెట్టుకున్న చింతపండు ఉప్పు వేసి అవసరం మేరకు నీరు వేసుకుని కొంచెం బరకగా చిక్కగా రుబ్బుకోండి.
  4. తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వండి, ఆ తరువాత కరివేపాకు, ఇంగువ, పసుపు వేయండి.
  5. ఈ తాలింపులో కొబ్బరి చట్నీ వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments