రవ్వ పాయసం | సులభంగా చేసుకునే కమ్మని పాయసం ఈ రవ్వ పాయసం
పండుగలప్పుడు లేదా ఎప్పుడడైనా తీపి తినాలనిపించినప్పుడు సులభంగా చేసుకునే కమ్మని పాయసం ఈ రవ్వ పాయసం. ఈ సింపుల్ రవ్వ పాయసం రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో కూడా ఉంది చూడండి.
“రవ్వ పాయసం” తమిళనాడులో చాలా ఎక్కువగా చేయడం చూశాను నేను. ఇంకా హోటల్స్ లో భోజనంతో పాటు ఇచ్చే స్వీట్ గా ఎక్కువగా చేస్తుంటారు తమిళనాడులో. రవ్వ పాయసం తెలుగు రాష్ట్రాలలో నేను ఎక్కువగా చూడలేదు.
చూడడానికి చేయడానికి చాలా సింపుల్ రెసిపీ కానీ రుచి చాలా ప్రేత్యేకంగా అనిపిస్తుంది.

టిప్స్
చిరోన్జి: చిరోన్జి పప్పు వేస్తే రుచి బాగుంటుంది అని వేశాను, అందుబాటులో లేకుంటే ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చిరోన్జి పప్పు పాలల్లో వేసే ముందు కచ్చితంగా 30 నిమిషాలు నానితే మెత్తగా ఉడుకుతుంది.
కుంకుమ పువ్వు: కుంకుమ పువ్వు లేకపోతే వదిలేయండి. వేస్తే మాంచి సువాసన రంగుతో ఉంటుంది పాయసం
రవ్వ పాయసం | సులభంగా చేసుకునే కమ్మని పాయసం ఈ రవ్వ పాయసం - రెసిపీ వీడియో
Semolina Kheer | Rava Payasam | Simple Quick Payasam Recipe | How to make Rava Payasam
Prep Time 1 min
Cook Time 20 mins
Total Time 21 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1/4 cup బొంబాయ్ రవ్వ (60 gm)
- 1/3 cup పంచదార (80 gm)
- 1/2 cup నీళ్ళు (120 ml)
- 1/4 cup జీడిపప్పు
- 1/4 cup నెయ్యి
- 1/2 liter పాలు
- కుంకుమ పువ్వు – చిటికెడు
- 3 tbsp చిరోన్జి పప్పు (30 నిమిషాలు నానబెట్టినది)
- 1/2 tsp యాలకలపొడి
- 1/4 pinch పచ్చ కర్పూరం
విధానం
-
నెయ్యి కరిగించి జీడిపప్పు ఎర్రగా వేపి తీసుకోండి.
-
అదే నెయ్యిలో రవ్వ వేసి ఎర్రగా వేపుకోవాలి సన్నని సెగ మీద. రవ్వ వేగాక నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి నెయ్యి పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
-
రవ్వలోంచి నెయ్యి పైకి తేలాక పాలు పోస్తూ రవ్వని గడ్డలు లేకుండా కలుపుకోవాలి.
-
రవ్వ పాలల్లో కలిసిపోయాక అప్పుడు చిరోన్జి పప్పు, వేసి కలుపుతూ 10-12 నిమిషాలు లేదా చిక్కబడే దాకా ఉడికించాలి.
-
పాయసం చిక్కబడుతుండగా పంచదార, కుంకుమపువ్వు, యాలకలపొడి, జీడిపప్పు వేసి కలిపి దింపేసుకోండి. నచ్చితే ¼ చిటికెడు పచ్చ కర్పూరం వేసుకోవచ్చు (edible camphor )

Leave a comment ×
3 comments