రవ్వ లడ్డు | మా స్టైల్ లో రవ్వ లడ్డు చేస్తే తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
రోజులు గడిచినా నోట్లో కరిగిపోయే రవ్వ లడ్డు చేయాలంటే తప్పక ఈ రెసిపీ ట్రై చేయండి. రవ్వ లడ్డు రెసిపి స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి. రవ్వ లడ్డు భారత దేశమంతా రాష్ట్రానికి ఒక్కో తీరుగా చేస్తారు చిన్న చిన్న మారుపులతో. నేను నా పద్ధతిలో చిన్న మార్పులతో బెస్ట్ టిప్స్తో రెసిపీ చెప్తున్నా.
సాధారణంగా రవ్వ లడ్డు చేసిన రెండవ రోజుకి బిరుసెక్కి గట్టిగా అయిపోతుంది. కానీ నా టిప్స్ ఫాలో అయితే వారం రోజులైనా జూసీగా ఉంటుంది.
రవ్వ లడ్డు చేసే ముందు ఈ టిప్స్ వకా సారి చదివి చేయండి.

టిప్స్
బొంబాయ్ రవ్వ:నేను ఉప్మా కోసం వాడే రవ్వని వాడాను. రవ్వని నేతిలో మాంచి రంగు సువాసన వచ్చేదాకా సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. అప్పుడే రవ్వ లడ్డుకి రుచి. రవ్వ పర్ఫెక్ట్గా వేగితే జీడిపప్పు వేగిన సువాసన వస్తుంది.
పచ్చి కొబ్బరి: రవ్వలో పచ్చి కొబ్బరి కనీసం 2 గంటలు నానబెడితే రవ్వ కొబ్బరి పాలని పీల్చి రవ్వకి రుచి పెరుగుతుంది. రవ్వ లడ్డు కూడా నిలవుంటుంది.
పంచదార పాకం: పంచదార పాకం కచ్చితంగా తీగ పాకం రావాలి అప్పుడే లడ్డు ఉందా చుట్టడానికి వస్తుంది, లేదా లడ్డు విరిగిపోతుంది
లడ్డు ఇలా చూట్టాలి:
-
లడ్డూ కాస్త వెచ్చగా ఉన్నప్పుడే చూట్టాలి అప్పుడే లడ్డూ వస్తుంది, లేదా లడ్డూ విరిగిపోతుంది.
-
లడ్డు ఉండ రావట్లేదు అంటే పాకం పలుచన అయితేనే రాదు. ఏ కారణం చేతనైనా లడ్డూ రాకపోతే కాచిన వేడి పాలు కొద్దిగా పోసి లడ్డూ కడితే వస్తుంది. కానీ పాలు పోసి లడ్డు కడితే 2-3 రోజుల కంటే నిలవ ఉండదు.
రవ్వ లడ్డు | మా స్టైల్ లో రవ్వ లడ్డు చేస్తే తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే - రెసిపీ వీడియో
Rava Laddu Recipe | How to make Rava Laddu at home | Suji ke Laddu | Rava Ladoo Preparation
Prep Time 5 mins
Cook Time 15 mins
Resting Time 2 hrs
Total Time 2 hrs 20 mins
Servings 20
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బొంబాయి రవ్వ (250 gms)
- 1/2 cup పచ్చి కొబ్బరి తురుము
- 3 tbsps నెయ్యి (50 gms)
- 10 - 15 జీడి పప్పు
- 10 - 15 ఎండు ద్రాక్ష
- 1 cup పంచదార (175 gms)
- 100 ml నీళ్ళు
- 3 - 4 యాలకల పొడి
విధానం
-
రవ్వని పచ్చి కొబ్బరిని కలిపి రెండు గంటలు వదిలేయండి.
-
బాండి లో నెయ్యి వేసి కరిగించి జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించి తీసి పక్కనుంచుకోండి.
-
ఇప్పుడు రెండు గంటలు నానబెట్టుకున్న రవ్వ వేసి సన్నని మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చే దాక వేపుకోండి. (కేవలం లో ఫ్లేం లోనే వేపుకోవాలి) దీనికి కనీసం 20-25 నిమిషాలు పడుతుంది.
-
మరో బాండిలో పంచదార నీళ్ళు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించండి.
-
తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న రవ్వ, జీడిపప్పు కిస్మిస్స్ వేసి బాగా కలిపి గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారనివ్వండి.
-
గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి, లేదంటే పొడి పొడి గా అయిపోతుంది. ఇప్పుడు గడ్డలుగా అయిపోయిన రవ్వని చిదుముకుని దాంట్లో యాలకలపొడి వేసి చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టాలి.
-
చల్లారక ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే కనీసం వారం పాటు ఫ్రెష్ గా ఉంటాయి.

Leave a comment ×
30 comments