బీరకాయ బాదాం పాలు కూర

బీరకాయ బాదాం పాలు కూర నున్నగా చెక్కుతీసుకున్న బీరకాయ ముక్కల్లో బాదం గసగసాల పాలు ఉప్పు కారం పసుపు వేసి ఉడికించి చేసే ఈ కమ్మని కూర వేడి అన్నం, చపాతీతో చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా తెలుగు వారు పాలు పోసి బీరకాయ సొరకాయ కూరలు పత్యం కూరలు అని పెడుతుంటారు. ఇలా పాలు పోసి చేసే కూరలు నోటికి కమ్మగా ఎంతో రుచిగా ఉంటాయి. ఎక్కువగా ఉప్పు కారాలు కూడా అవసరం అవ్వవు. కాబట్టి పొట్టకి తేలికకగా ఉండే కూరలు కోసం చూస్తున్నప్పుడు ఈ బీరకాయ బాదాం పాలు కూర చేయండి చాలా నచ్చుతుంది అందరికి.

టిప్స్

బీరకాయ:

  1. లేత బీరకాయని నున్నగా చెక్కు తీసుకుని సన్నని ముక్కలుగా కోసుకోండి. తీసుకున్న బీరకాయ చెక్కులో కొన్ని టొమాటోలు వేరుశెనగగుండ్లు పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టి పచ్చడి నూరుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

బాదాం గసగసాల పేస్ట్:

  1. బాదాం గసాలు మీకు మెత్తగా గ్రైండ్ చేయడం మిక్సికి కష్టంగా అనిపిస్తే 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది.

బీరకాయ బాదాం పాలు కూర - రెసిపీ వీడియో

Ridge Gourd in Almond Milk Curry (Beerakaya Badam Paalu Koora)

| vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 30 mins
  • Cook Time 20 mins
  • Total Time 55 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • ½ kg బీరకాయ ముక్కలు
  • 2 tbsp పచ్చిశెనగపప్పు
  • 18-20 బాదం
  • ½ tbsp గసగసాలు
  • 3 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 2 sprigs కరివేపాకు
  • ½ cup ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 tsp కారం
  • పసుపు - చిటికెడు
  • దాల్చిన చెక్క - 1 అంగుళం
  • 5 లవంగాలు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

విధానం

  1. బాదం గసగసాలని నీరు పోసి 30 నిమిషాలు నానబెట్టి నీటిని వడకట్టి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. పచ్చిశెనగప్పలుని నీరు పోసి 1/2 గంట నానబెట్టుకోండి.
  3. నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు పెట్టండి.
  4. ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి ఉల్లిని మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వండి.
  5. మగ్గిన ఉల్లిలో బీరకాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపి మూత పెట్టి 10-12 నిమిషాలు మగ్గనిస్తే చక్కగా నీరు పైకి తేలుతుంది.
  6. నీరు వదిలిన బీరకాయ ముక్కల్లో పసుపు కారం బాదాం ముద్దా వేసి కలిపి 1/2 కప్పు నీరు పోసి దగ్గరగా ఉడకనివ్వండి.
  7. దాల్చిన చెక్క లవంగాలు మెత్తని పొడి చేసి దగ్గరపడ్డ బీరకాయ బాదాం పాలు కూరలో చల్లుకోండి.
  8. ఆ పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి దింపేసుకోండి. కూరని మరీ దగ్గర ఉడికిస్తే చల్లారిన తరువాత ఇంకా దగ్గరపడి ముద్దగా అయిపోతుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.