దొండకాయ సెనగపప్పు కూర | దొండకాయ కూర

దొండకాయ సెనగపప్పు కూర దొండకాయ చీలికలని ఉడికించి తాలింపు పెట్టి అందులో ఉల్లి నానబెట్టుకున్న సెనగపప్పు కొబ్బరి అల్లం పచ్చిమిర్చి ముద్దా వేసి చేసే కూర నిమిషాల్లో తయారవుతుంది నిమిషాల్లో ఖాళీ కూడా అయిపోతుంది. అంత రుచి అంత సులభం ఈ కూర.

సాధారణంగా దొండకాయతో ఏ కూర చేసినా ఎంతో రుచిగా ఉన్నా తయారు చేయడానికి సమయం పడుతుంది కానీ ఈ తీరులో చేస్తే చాలా త్వరగా తయారైపోతుంది ఇంకా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ ఇంకా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారికి లేదా ఆఫీసులకి వెళ్లే వారికి త్వరగా తయారయ్యే కూర ఏదైనా కావాలనుకుంటే ఈ కూర పర్ఫెక్ట్!!!

టిప్స్

దొండకాయ:

  1. దొండకాయని ఒకే తీరులో చేరుకుంటే అన్నీ ఒకే తీరులో ఉడికి మగ్గుతాయ్.

  2. దొండకాయని కుక్కర్లో ఒక్కటే విజిల్ హై ఫ్లేమ్ మీద రానిచ్చి స్టవ్ ఆపేస్తే ముందు దొండకాయ మగ్గిపోతుంది, ఆ తరువాత మిగిలినది తాలింపులో మగ్గుతుంది.

సెనగపప్పు :

  1. 100 గ్రాముల కందిపప్పుకి 1 tbsp పచ్చిశెనగపప్పు సరైన కొలత. నేను 300 గ్రాముల దొండకాయ చీలికలు తీసుకుంటున్నాను కాబట్టి మూడు చెంచాలు సరిగ్గా సరిపోతాయి. దొండకాయల్ని సెనగపప్పుని కలిపి ఉడికించేసుకుంటే సరిగా పప్పు చిదురైపోకుండా ఉడికిపోతుంది.

దొండకాయ సెనగపప్పు కూర | దొండకాయ కూర - రెసిపీ వీడియో

Ivy Gourd Chana Dal Curry | Dondakaya Senagapappu Curry

Curries | vegetarian
  • Prep Time 10 mins
  • Soaking Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 45 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కావలసినవి:
  • 300 grams దొండకాయ చీలికలు
  • 3 tbsp పచ్చి సెనగపప్పు
  • ¾ cup నీళ్లు
  • కొబ్బరి ముద్ద కోసం:
  • ¼ cup పచ్చి కొబ్బరి
  • 3 పచ్చి మిర్చి
  • అల్లం - అంగుళం
  • తాలింపు కోసం:
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • ఇంగువ - కొద్దిగా
  • ½ tsp జీలకర్ర
  • 2 sprigs కరివేపాకు
  • ⅓ cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ¼ tsp పసుపు
  • ½-1 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

విధానం

  1. మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పును పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి.
  2. ప్రెషర్ కుక్కర్లో దొండకాయ చీలికలు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు నీరు పోసి ఒక్కటే విజిల్ హై ఫ్లేమ్ మీద రానిచ్చి స్టవ్ ఆపేయండి.
  3. మిక్సర్ జార్లో కొబ్బరి అల్లం పచ్చిమిర్చి వేసి బరకగా పేస్ట్ చేసి ఉంచుకోండి.
  4. నూనె వేడి చేసి ఆవాలు మినపప్పు కరివేపాకు ఇంగువ వేసి వేపుకోండి.
  5. వేగిన తాలింపులో ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి ఉల్లిని మెత్తబడనివ్వండి.
  6. మెత్తబడ్డ ఉల్లిలో సగం పైన ఉడికిన దొండకాయ ముక్కలు సెనగపప్పు వేసి 3-4 నిమిషాలు మగ్గనివ్వండి.
  7. మగ్గుతున్న కూరలోకి పసుపు కారం ధనియాల పొడి దొండకాయని ఉడికించుకున్న నీరు కొద్దిగా పోసి కలిపి మూత పెట్టి 7-8 నిమిషాలు మగ్గించండి.
  8. దొండకాయ పూర్తిగా మగ్గిపోయిన తరువాత కొబ్బరి ముద్దా వేసి ఇంకో 3-4 నిమిషాలు మగ్గించండి.
  9. చివర్లో కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • S
    Sirisha
    I have been following your Channel and recipes for about a year now Teja garu. I love your recipes and how you present the on your videos. Your videos are not just informative but also very entertaining. Keep up the great work. You and your wife deserve all the kudos for making a career change which is very inspiring as well.
  • S
    Sam
    I want how to see you videos without internet.becaue I see your vedios until my mobile says that your data is over