పనీర్ బటర్ మసాలా

“పనీర్ బటర్ మసాలా” అందరి ఫేవరేట్ పంజాబీ కర్రీ. ఇది భారతీయులకే కాదు విదేశీయులు కూడా చాలా ఎక్కువ మంది ఇష్టపడే రెసిపీ. ఇది రోటీ, నాన్ చపాతీ, పూరి, జీర రైస్ ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.

ఈ పనీర్ బటర్ మసాలా పంజాబీ వంటకం అయినా మన దగ్గరికి వచ్చేపాటికి మన మసాలాలు కారాలతో మరో తీరుగా ఉంటోంది. అసలు బటర్ మసాలా మన స్టైల్లోలాగా మసాలా ఘాటుతో ఉండదు, కమ్మగా ఉంటుంది ఉండాలి.

ఈ పనీర్ బటర్ మసాలానే పనీర్ మఖనీ అని బయర్ పనీర్ మసాలా అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఏదైనా ఒక్కటే, చిక్కని టొమాటో జీడిపప్పు గ్రేవీతో క్రీమీగా ఉంటుంది.

టిప్స్

గ్రేవీ అంత చిక్కగా ఎర్రగా ఎలా వస్తుంది :

• పనీర్ బటర్ మసాలా గ్రేవీ టొమాటో జీడిపప్పుని గ్రైండ్ చేసి చేసేదే. ఈ గ్రేవినే మాఖ్యని గ్రేవీ అంటారు. అంత రంగు రావడానికి బాగా పండిన ఎర్రని టొమాటో వాడడం వల్ల, ఇంకా కాశ్మీరీ కారం వేయడం వల్ల అంత రంగు వస్తుంది కూరకి.

రెస్టారెంట్ లాంటి గ్రేవీ రావాలంటే :

• టొమాటోలు బాగా పండినవి ఇంకా పులుపు తక్కువగా ఉండే టొమాటోలు వాడుకుంటే గ్రేవీ కమ్మగా వస్తుంది

• జీడిపప్పు వేయడం వల్ల అంత చిక్కని కమ్మని గ్రేవీ వస్తుంది

• పనీర్ మృదువుగా తాజాగా ఉన్నది వాడాలి. బజార్ నుండి తెచ్చిన పనీర్ అయితే గ్రేవీలో వేసే ముందు 10 నిమిషాలు నీళ్ళలో నానబెడితే సాఫ్ట్ అవుతుంది. ఇంకా ఇంట్లో చేసుకునే పనీర్ ఎప్పుడూ గొప్ప రుచినిస్తుంది.

• కసూరీ మేథి నలిపినది వేసుకోవాలి. కసూరీ మేథీ లేకపోతే కొత్తిమీర వేసుకోండి. కానీ కసూరీ మేథీ వాడాలి అని గుర్తుంచుకోండి.

• నేను గ్రేవీని ఇంకా క్రీమీగా ఉంచడానికి కొద్దిగా పిస్తా వాడను. ఇది గ్రేవీకి కొత్త రుచినిస్తుంది. సంప్రదాయ పనీర్ బటర్ మాసాలలో అయితే పిస్తా వాడరు.

• గ్రేవీలో పంచదార వేస్తే టొమాటోల్లోని పుల్లదనాన్ని చక్కగా బాలన్స్ చేస్తుంది.

• గ్రేవీ లో నీళ్ళు పోసి మారిగిస్తుండగా పైన తేట ఏర్పడుతుంది దాన్ని తీసేస్తే గ్రేవీ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

• టెట్రా పాక్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉండే పాల మీగడ వాడుకోవచ్చు.

• మసలాలు కారాల మోతాదు తక్కువగా ఉంచాలి, ఈ మసాలా కారంగా ఉండదు.

Paneer Butter Masala Recipe

పనీర్ బటర్ మసాలా - రెసిపీ వీడియో

Paneer Butter Masala | How to make Paneer Butter Masala Recipe

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms పనీర్
  • 5 టమాటో
  • 1 ఉల్లిపాయ
  • 1/4 cup జీడిపప్పు
  • 1 ఇంచ్దా ల్చిన చెక్క
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • 1/2 ఇంచ్ అల్లం
  • 4 వెల్లూలి
  • 1/2 tsp నలిపిన కసూరి మేథి
  • 3/4 tsp ధనియాల పొడి
  • 3/4 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp పంచదార
  • 4 tbsps బటర్
  • ఉప్పు
  • 2 tsps కాశ్మీరీ కారం
  • 1 tbsp నూనె
  • 1/2 cup ఫ్రెష్ క్రీం(పాల మీగడ)
  • 2 tsps కొత్తిమీర
  • 300 ml నీళ్ళు గ్రేవీ కోసం
  • 1/2 ltr టొమాటోలు ఉడికించడానికి

విధానం

  1. పాన్లో టమాటో ముక్కలు, ఉల్లిపాయ, చెక్క, లవంగాలు, యాలకలు, జీడిపప్పు ½ లీటర్ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
  2. మెత్తగా ఉడికాక నీళ్ళతో సహా వెన్నలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
  3. పాన్ లో బటర్ కరిగించి అందులో, కాస్త నూనె, కష్మీరి కారం వేసి కాసేపు వేపి అందులో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు టమాటో పేస్టు వేసి బాగా కలుపుతూ చిక్కబడనివ్వండి.
  4. గ్రేవీ చిక్కబడ్డాక కసూరీ మేథీ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి 300 ml నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.
  5. మరుగుతున్న గ్రేవీ పైన నూరగతో తేట ఏర్పడుతుంది దాన్ని తీసేయండి. కూర ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
  6. గ్రేవీ కాస్త చిక్కబడ్డాక పనీర్ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి.
  7. ఆఖరున ఫ్రెష్ క్రీం(పాల మీగడ) వేసి కలుపుకోండి.
  8. దిమ్పేసే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

16 comments

  • S
    srimayyia
    Recipe Rating:
    The meal was incredibly delicious 😋. We appreciate your motivation to cook.Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 97222
  • L
    Lavanya
    Recipe Rating:
    Superb taste! My kids liked it. thanks one quick question.. where did u use ginger and garlic.. do we need to boil with tomatoes?
    • J
      Jyothi
      yes Lavanya. This recipe is present in his youtube channel as well. Excellent explanation.
  • S
    SATYANARAYANA CH
    Recipe Rating:
    This is easiest way to cook
  • M
    Manasa Gurram
    The dish came out so tasty 😋. Thanks for inspiring us to cook.
  • L
    Lasya priya
    Recipe Rating:
    Super vismai garu
  • M
    Manoj kumar
    Recipe Rating:
    This is my fav. Many times I tried with your video.. awesome
  • S
    Smaran
    Recipe Rating:
    Hi Teja garu,my wife is following all your recepies for a very long time.out of all the recepies,paneer butter masala is the one which I liked most.i am from nellore.as a foodie I tried in almost all the restaurants but none of them satisfies the taste which your recepie gave. Thank you Teja garu we are expecting more videos from you.
  • K
    Kranthi
    Recipe Rating:
    మీ రెసిపీ నీ ఫాలో అయి చేశాను సూపర్ గా వచ్చింది. Thank you for good recepie.
  • M
    Mounika
    It's yummy 😋 I love vismaifood
  • B
    Baby Nagasri
    Meeru chesina Andhra style paneer curry nenu try chesa chala chala bagundi chapati Loki superb undi
  • N
    NRK Srikar
    Tried this yesterday and boom!! Turned out to be my forever fav dish!! Thanks Andi!!
  • R
    Ravi
    Recipe Rating:
    Superb. Simple ingredients and the narration is so well. I'm making a vegan version of this :) Feedback: There is no mention of when to add the garlic cloves and Ginger above. I think it should be mentioned in the first point.
  • P
    pratyusha
    Recipe Rating:
    Super
  • C
    Chaitra
    Recipe Rating:
    Hi annaya thank u for the beautiful recipes.chala baga easy ga vanta nerpistharu thank u so much ❤️ this s one of bestt recipe annaya 🥰
  • R
    Ramesh
    Recipe Rating:
    Very nice 👌