చపాతీ, పరోటా, నాన్ ఇంకా రోటీల్లోకి బెస్ట్ కర్రీ కావాలంటే కాజు మష్రూమ్ కర్రీ ట్రై చేయండి. సూపర్ హిట్ అయిపోతుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఫోన్ చేసి పార్టీ ఉంది ఈసీగా అయిపోయే బెస్ట్ కర్రీ కావలి అని అడుగుతుంటారు. వెంటనే నేను చెప్పే కొన్ని కూరల్లో ఇది కూడా ఉంటుంది. ఏ స్పెషల్ పార్టీ అయినా ఈ కూరతో ఇంకా స్పెషల్ అయిపోతుంది.

ఇది రోటీలతో పాటు బగారా రైస్, జీరా రైస్ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది.

Kaju Mushroom Masala | Mushroom Masala | How to make Kaju Mushroom Masala Recipe

టిప్స్

  1. ఈ కర్రీలో బేస్ గా వాడే టమాటో జీడిపప్పు పేస్టు వెన్నలా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే అసలైన రుచి. అలా గ్రైండ్ అవ్వాలంటే జీడిపప్పు నానబెట్టి వేసుకోవాలి. అప్పుడు మెత్తగా గ్రైండ్ అవుతుంది

  2. కూరలో వేసే ఉల్లిపాయ సన్నగా ఒకే తీరుగా తరిగి ఎర్రగా వేపుకోవాలి. అప్పుడు కూరకి రుచి, గ్రేవీకి చిక్కదనం.

  3. జీడిపప్పు, మష్రూమ్ కలిపి వేపాలి అప్పుడు మష్రూమ్ మెత్తబడదు కూరలో. అలా పర్ఫెక్ట్ గా వేపుకోవాలంటే జీడిపప్పు వేసి కాస్త వేగగానే మష్రూమ్స్ వేసి జీడిపప్పు రంగు మారే దాక వేపుకుని తీసుకోండి.

  4. మరీ ఎక్కువగా వేపితే మష్రూమ్స్ పల్చని రేకుల్లా వేగి తినేందుకు అంత రుచిగా ఉండదు, కూర.

  5. మష్రూమ్స్ రెండు సగాలుగా మాత్రమే కోసుకోండి. మరీ చిన్న ముక్కలుగా కోయకండి

  6. నేను ఆఖరున దిమ్పెప్పుడు 1 tbsp నెయ్యి వేస్తుంటాను. అది కూరకి ప్రేత్యేకమైన కమ్మదనాన్ని ఇస్తుంది.

కూరకి అంత రంగు ఎలా వస్తుంది?
  1. ఏ కూరకైనా వాడే పదార్ధాలు, వేపే తీరుని బట్టి కూర రంగు వస్తుంది. నేను ఈ కూరకి మామూలు కారం తో పాటు. కాశ్మీరీ కారం వాడాను. ఈ కారం మాంచి రంగు తో పాటు, ఘాటైన సువాసనతో ఉంటుంది. కాశ్మీరీ కారం, కారం తక్కువ గా ఉంటుంది. కానీ, మంచి రంగుతో ఉంటుంది. దీని వల్ల అలాంటి ఎర్రని రంగు వస్తుంది.

  2. ఒక వేళ కాశ్మీరీ కారం లేనట్లైతే మన కారమే 1 tbsp వేసుకోండి. కానీ సాంబార్ కారం, లేదా కూర కారం వాడకండి. అందులో ఆవాలు, మెంతులు ఉంటాయి. అవి ఈ కూర కి బాగుండదు.

kaju mushroom masala gravy

కాజూ మష్రూమ్ మసాలా - రెసిపీ వీడియో

Kaju Mushroom Masala | Mushroom Masala | How to make Kaju Mushroom Masala Recipe

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • గ్రేవీ కోసం
  • 3 పండిన ఎర్రటి టొమాటోలు
  • 1 ఇంచ్ అల్లం ముక్క
  • 1/4 cup జీడిపప్పు ((15 mins నానబెట్టినది))
  • 3 పచ్చిమిర్చి
  • 4 వెల్లూలి
  • 2 యాలకలు
  • 3 లవంగాలు
  • 2 ఎండు మిర్చి
  • 1/2 tsp మిరియాలు
  • 1/4 cup మీగడ పెరుగు
  • తగినన్ని నీళ్ళు మెత్తగా రుబ్బుకోడానికి
  • కూర కోసం
  • 1/2 cup నూనె
  • 3/4 cup జీడిపప్పు
  • 150 gms మష్రూమ్స్
  • 1 ఉల్లిపాయ సన్నని తరుగు
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp కారం
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp ధనియాల పొడి
  • 2 tsps కాశ్మీరీ కారం
  • 1.5 tsps ఉప్పు
  • 350 ml నీళ్ళు
  • 1 tbsp నెయ్యి
  • 2 tbsps కొత్తిమీర తరుగు
  • 1/2 చెక్క నిమ్మరసం

విధానం

  1. మిక్సీ జార్ లో గ్రేవీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని, పలుకు లేని పేస్టు చేసుకోండి.
  2. నూనె వేడి చేసి జీడిపప్పు వేసి సగం వేపుకోవాలి.
  3. మష్రూమ్స్ వేసి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని తీసి పక్కనున్చుకోవాలి.
  4. అదే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిపాయాల్లో కారం, కాశ్మీరీ కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మసాలాల పొడిని బాగా వేపుకోవాలి.
  6. అందులో గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి, 350 ml నీళ్ళు పోసి గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలనివ్వాలి.
  7. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి.
  8. నూనె తేలాక జీడిపప్ప్పు, మష్రూమ్స్ వేసి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి.
  9. ఆఖరున నెయ్యి కొత్తిమీర తరుగు చల్లి మరో నిమిషం ఉడకనివ్వాలి.
  10. దింపే ముందు 1/2 చెక్క నిమ్మరసం పిండుకుని దిమ్పెసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

15 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Konchem karam ekkuvaindi. Mushroom pulupu ga ayyindi
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Wonderful !
  • S
    Satya
    Recipe Rating:
    Hi sir mee recipes anni chala chala baguntai
  • A
    Anitha ravi
    👌👌
  • P
    Prasad vittal
    I need all the recipients in pdf format please
    • S
      Santosh Ghumre
      DIY recipients in pdf format recipe: Call your recipients home for dinner. Prepare this curry and serve them. Then, when they are eating take their group photo. Then convert the picture to pdf format. Voila! All the recipients in pdf format, ready!
  • A
    Alladi Mercy Jones
    Recipe Rating:
    Thank you for sharing this recepie..🙏🙏🙏
  • A
    Archana
    Recipe Rating:
    Delicious curry. My kids are picky eaters but they also enjoyed this curry.
  • P
    Pradeep
    Very nice foods
  • H
    Hema
    Recipe Rating:
    Very nice I am a teenager and loved it by parents my first recipe🎉🎉
  • S
    Suma Bhaskar
    Recipe Rating:
    Loved by all !!
  • P
    Padma
    Recipe Rating:
    How many does the recipe you listed serve? If I need to double the recipe - do I double everything or just the mushrooms and cashews "Curry" part not the tomato "Gravy" part? Same if I triple the recipe?
  • A
    Anusri
    Recipe Rating:
    Taste super brother.nenu try chesanu ma family ki chalabaga nacchindhi.thanks brother
  • T
    Tarun
    Recipe Rating:
    Delicious