Curries
5.0 AVERAGE
3 Comments

చెట్టినాడు అనగానే ముందు అక్కడి వంటకాల ఘాటు గుర్తొస్తుంది. ఏది చేసినా ఓ పిసరన్న చెట్టినాడు ఘాటు నషాలానికి అంటాల్సిందే ! అందుకే తమిళనాడు వారితో పాటు యావత్ దేశం లో అందరు చెట్టినాడు వంటకాలకి అభిమానులుగా మారిపోయారు!

ఈ ఆలూ వేపుడు మామూలు ఆలూ వేపుడుకి మల్లె ఉప్పు కారం వేసి వేపడం కాక, కాస్త భిన్నంగా భలేగా ఉంటుంది. ఇది వేడి వేడి నెయ్యన్నంతో పెరుగన్నం లో నంజుడుకి కూడా సూపరే!

Chettinad Spicy Crispy Potato Fry Recipe | How to make Crispy Potato Fry Recipe

టిప్స్

• పలుచని తోలు ఉన్న దుంపలు వాడితే కరకరలాడుతూ వస్తుంది వేపుడు.

• దుంపలని చెక్కు తీసి, చెక్కు తీయకుండా ఎలా అయినా వాడుకోవచ్చు. చెక్కు తీయనట్లైతే దుంపలని బాగా కడిగి వాడుకోండి

• దుంప ముక్కలని 80 % మాత్రమే మూత పెట్టకుండా ఉడికించండి. 80% ఉడికిస్తే మిగిలనది నూనెలో వేగేప్పుడు మగ్గిపోతుంది. మరీ మెత్తగా ఉడికిస్తే నూనెలో వేగేప్పుడు చిదిరిపోతాయ్

• నేను చేసిన మసాలా పొడి మీరు తినగలిగే కారనికి తగినట్లుగా వేసుకోండి

• వేపుడు నాన్ –స్టిక్ పాన్లో వేపేకన్నా కాస్ట్ – ఐరన్ ముకుళ్లలో చాలా బాగా వేగుతాయ్

Chettinad Spicy Crispy Potato Fry Recipe | How to make Crispy Potato Fry Recipe | Aloo Fry Recipe

చెట్టినాడు ఆలూ ఫ్రై - రెసిపీ వీడియో

Chettinad Spicy Crispy Potato Fry Recipe | How to make Crispy Potato Fry Recipe | Aloo Fry Recipe

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kg ఉడికిన్చుకున్న బంగాలదుంప ముక్కలు
  • 1/4 cup నూనె
  • 1/4 spoon పసుపు
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 రెబ్బ కరివేపాకు
  • మసాలా పొడి కోసం
  • 2 tsps ధనియాలు
  • 1 tbsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp సోంపు
  • 1 inch దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 1 అనాస పువ్వు
  • మరాటి మొగ్గ (సగం ముక్క)
  • 6 ఎండుమిర్చి

విధానం

  1. మసాలా కోసం ఉంచిన సామానంతా వేసి లో-ఫ్లేం మీద ఎర్రగా మంచి సువాసనోచ్చెంత వరకు వేపి కాస్త బరకగా పొడి చేసుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, పసుపు వేసి వేపి ఉడికించి ముక్కలుగా చేసుకున్న బంగాళా దుంపల ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద క్రిస్పీగా వేపుకోండి.
  3. బంగాలదుంపలు మీడియం ఫ్లేం మీద మూత పెట్టకుండా వేపుకోండి, ఎర్రగా వేగడానికి కనీసం 20 నిమిషాలు పైన టైం పడుతుంది.
  4. ఎర్రగా వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలుపుకుని ౩-4 నిమిషాలు వేపుకుని దిమ్పెసుకోవడమే.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • N
    Neeraja Chowdary
    ఆహా అద్భుతం అమోఘం, గత కొన్ని సంవత్సరాలుగా నేను మిమ్మల్ని చూస్తూ కొన్ని వంటలు చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను కుడా యూట్యూబ్ ఛానెల్ పెట్టాను, థ్యాంక్ యూ సో మచ్ అండి తేజ గారు😊🙏🏻
  • M
    ManjulaKumar
    Recipe Rating:
    You cook so delicious food sir
  • M
    ManjulaKumar
    Recipe Rating:
    You cook so delicious sir
Chettinad Spicy Crispy Potato Fry Recipe | How to make Crispy Potato Fry Recipe