“భిండి దో ప్యాజా” ఉత్తర భారతదేశంలో ఎంతో ఫేమస్. ఇది పెళ్ళిళ్ళలో ప్రేత్యేకంగా సర్వ్ చేస్తారు. నాకు ఈ కూరంటే నాకు చాలా ఇష్టం, కాని ఎప్పుడు చేసినా బెండకాయలు జిగురోస్తాయ్ తినేందుకు కూడా అంత రుచిగా ఉండదు. కానీ పెళ్ళిళ్ళలో ఇంకా దాబాల్లో రెస్టారెంట్స్లో చేసిన పర్ఫెక్ట్ స్టైల్ నాకు రాలేదు, కాబట్టి వదిలేశా.

ఓ సారి నేను సూరత్ దగ్గర ఓ దాబాలో తిన్నాను చాలా రుచిగా ఉంది, అందులో వారు ఆలూ వేయడం చూసాను, ఆ రుచి కూడా చాలా బాగుంది. పైగా ఆ రోజు నాకు వారి కిచెన్ లోపలి వెళ్లి చూసేందుకు అవకాశం దొరకడంతో ఈ కూర తయారీ చూసాను, దానితో నేను చేసే పొరపాట్లు తెలిశాయి. వారు చేసిన కూరకి నా అనుభవాన్ని కొంత జోడించి తయారుచేసిన కూరే ఈ భిండి దో ప్యాజా.

ఇది రొట్టెలు, పూరీలు, అన్నం ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్

బెండకాయ జిగురు రాకుండా ఉండాలంటే?

  1. లేత బెండకాయలు కూరకి ఎంతో రుచి. బెండకాయలు కడిగి తుడిచి ఆరబెట్టాలి. ఆ తరువాత తడి లేని కత్తితో ముక్కలు కోసుకుని ఆరబెట్టాలి

  2. బెండకాయ ముక్కలు నూనెలో వేసి మూత పెట్టి హై- ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయ ముక్కల అంచులు రంగుమారే దాక వేపుకుంటే అస్సలు జిగురురాదు

బెస్ట్ కూరకి ఇంకొన్ని టిప్స్:

• బెండకాయ వేపుడు అడుగు మందంగా ఉండే ఇనుప ముకుళ్ళు చాలా రుచినిస్తాయ్

• సహజంగా భీండి ధో ప్యాజా లో ఆలూ వేయారు, నేను సూరత్ దగ్గర నాకు నచ్చిన ఢాభా స్టైల్లో చేస్తున్నా

• వాము కూరకి మాంచి సువాసనని ఇస్తుంది. నచ్చని వదిలేవచ్చు

• ఉల్లిపాయ పాయలు పింక్ రంగులోకి మారితే చాలు తీసేయాలి. అలా వేగిన ఉల్లిపాయలు కూరకి మాంచి రుచినిస్తాయ్

Bhindi do pyaza | Okra Onion Curry

భిండి దో ప్యాజా - రెసిపీ వీడియో

Bhindi do Pyaza | Okra Onion Curry | Easy Bhindi do Pyaza Recipe with Video | How to Make Bhindi do Pyaz

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms లేత బెండకాయలు
  • 1 ఉల్లిపాయ (రేకులులా తరుక్కున్నది)
  • 1 ఉల్లిపాయ (సన్నని తరుగు)
  • 2 టమాటోల పేస్టు
  • 1 టమాటో పెద్ద ముక్కలు
  • 1/4 spoon వాము ()
  • 3/4 spoon అల్లం తరుగు
  • 1/3 cup నూనె
  • 1 tbsp కారం
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 2 tbsps కొత్తిమీర తరుగు

విధానం

  1. 3 tbsps నూనె వేడి చేసి అందులో వాము నలిపి వేసుకోండి, వాము వేగాక బంగాళదుంప ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద ముక్కలు మెత్తబడి అంచులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి
  2. ఇప్పుడు కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలుగా కోసుకున్న బెండకాయలు వేసి కేవలం హై-ఫ్లేం మీద మాత్రమే బెండకాయలు మగ్గెంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  3. 12-15 నిమిషాలకి బెండకాయలు మెత్తబడి అక్కడక్కడ నల్లబడి మెత్తబడుతుంది అంటే ముక్కలోని జిగురోదిలింది, ముక్కలు మగ్గాయ్ అని గుర్తు.
  4. ఆ తరువాత గులాబీ రేకుల్లా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 3-4 నిమిషాల పాటు ఫ్రై చేయండి.
  5. ఉల్లిపాయలు రంగు మారి మగ్గితే చాలు, తీసి పక్కనుంచండి.
  6. ఇప్పడు మరో పాన్ లో 2 tbsps నూనె వేడి చేసి అందులో అల్లం తరుగు వేసి వేపి సన్నని ఉల్లితరుగు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాక ఫ్రై చేయండి.
  7. ఇప్పుడు 2 టొమాటోల గుజ్జు వేసి టొమాటోల నుండి నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి.
  8. టమాటోలు మెత్తగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోండి
  9. నూనె పైకి తేలాక టమేటా ముక్కలు వేసి ముక్కలు మెత్తబడే దాక చిదమకుండా ఫ్రై చేసుకోండి.
  10. ఇప్పుడు వేపుకుని ఉంచుకున్న బెండకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి టమాటో గుజ్జు పట్టించి 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
  11. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దిమ్పెసుకోండి.
Bhindi do Pyaza | Okra Onion Curry | Easy Bhindi do Pyaza Recipe with Video